Loading...

5, ఆగస్టు 2012, ఆదివారం

బొట్టు పెట్టుకోండి.


నుదుటన ఎప్పుడూ బొట్టు ధరించడం మన ఆచారం.విదేశీ అలవాట్ల మోజులో పడి ఎన్నో వదిలేసిన మనం ఈ అలవాటును , ఆచారాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాము. దీనికంతటికీ ఆద్యులు మగవారే. ఈరోజు ఆధునిక, అనాగరిక, అసభ్య వస్త్రధారణను, పెద్దలను బాధపెట్టే ప్రవర్తనను, కుటుంబాన్ని లెక్కచేయకపోవడాన్ని, బాధ్యతలను నిర్లక్ష్యం చేయడాన్ని మొదట పోయినతరాల్లో మగవారే అత్యధికంగా చేశారుఅని నా అభిప్రాయం

.              ప్రతి పనీలో ఆలోచనే లేకుండా సమానత్వం పేరుతో మగవారిని అనుకరించే ఆడవారు ఇప్పుడు ఆ పని చేస్తున్నారు అని నా అభిప్రాయం

                  చాలామంది అమ్మాయిలకు చెప్తుంటారు, బొట్టు పెట్టుకోమని. కానీ మగవాళ్ళైనా సరే ఖచ్చితంగా బొట్టు పెట్టుకోవాలి. అది కుంకుమ అయినా సరే, విభూతి అయినా, చందనమైనా ఏదైనా నుదురు ఖాళీగా ఉంచకూడదు. ఖాళీగా ఉంచుకుంటే ఎదుటి మనిషి ఆధిక్యతకు లోబడడం జరుగుతుంది అంటారు. ఎంతవరకు నిజమో తెలీదు.

              చాలా ఆధునికమని చెప్పుకునే బడులలో బొట్టు పెట్టుకుంటే అనాగరీకమని మౌన ప్రచారం జరుగుతున్నది. ఒకరిని చూసి మరొకరు ప్రభావితులౌతున్నారు. ఈ విధంగా బొట్టు పెట్టుకుని తీరాలన్న నియమం పై పట్టు లేకపోవడంతో ఇంట్లో, బయట కూడా అలాగే తిరుగుతుంటారు. సినిమాల్లో , సీరియల్లో నూ కూడా విలనీ చూపించే వాళ్ళనంతా అత్యాధునికులు గా (నా దృష్టిలో అనాగరీకులుగా) చూపిస్తారు. మొత్తం కథంతా వారి ఆధిక్యతే ఉంటుంది. చివరలో వాళ్ళు మారినట్టు చూపించినపుడు సాంప్రదాయికంగా చూపిస్తారు. చాలామంది మీద ఏ ప్రభావం పడుతుంది చెప్పండి.

                    దైవంపై నమ్మకం ఉంటే ఖచ్చితంగా బొట్టు ధరించండి. బొట్టు ధరించడం వలన మీ అందం ఏమీ తక్కువ కాదు. ప్రత్యేకమైన అందం వస్తుంది. ముఖంలో ఎంతో మార్పు కనిపిస్తుంది.

17 కామెంట్‌లు:

  1. నిజమే, తప్పనిసరిగా కుంకుమను నొసట ధరించే ఆచారం బలీయంగా మన పూర్వీకులలో ఉండేది. రెండు కనుబొమలకు మద్యభాగంలో నుదుటి వద్ద ఇడా పింగళ సుషుమ్ననాడులు కలిసే స్థలం వద్ద కుంకుమధారణ శుభప్రదం. పైగా ఈ చోటనే ఆజ్ఞాచక్రముంటుంది. ఈ స్థానముకు అమృతస్థానమని పేరు. సకలదేవతలకు ఇది స్థానం. కుంకుమధరించే వ్యక్తికి ఎదుటివారు మానసికంగా లొంగి ఉంటారని, దృష్టిదోషం తగలదని పెద్దలు చెప్తుంటారు. బొట్టు పెట్టుకోవడం పవిత్రతకు, అస్తికత్వానికి, దార్మికత్వానికి, పుష్టికి పురుషులకు సంకేతమైతే, ఐదవతనానికి, సౌభాగ్యానికి, స్థిరబుద్ధికి స్త్రీలకు సంకేతం. కుంకుమధారణ భారతీయ చిహ్నం. అది మన హిందూ సాంప్రదాయకం. పాశ్చాత్య పోకడలలో మనసాంప్రదాయకమును మర్చిపోకూడదు. మంచి పోస్ట్ పెట్టారు, అభిననదనలు.

    రిప్లయితొలగించండి
  2. నిజమే, తప్పనిసరిగా కుంకుమను నొసట ధరించే ఆచారం బలీయంగా మన పూర్వీకులలో ఉండేది. రెండు కనుబొమలకు మద్యభాగంలో నుదుటి వద్ద ఇడా పింగళ సుషుమ్ననాడులు కలిసే స్థలం వద్ద కుంకుమధారణ శుభప్రదం. పైగా ఈ చోటనే ఆజ్ఞాచక్రముంటుంది. ఈ స్థానముకు అమృతస్థానమని పేరు. సకలదేవతలకు ఇది స్థానం. కుంకుమధరించే వ్యక్తికి ఎదుటివారు మానసికంగా లొంగి ఉంటారని, దృష్టిదోషం తగలదని పెద్దలు చెప్తుంటారు. బొట్టు పెట్టుకోవడం పవిత్రతకు, అస్తికత్వానికి, దార్మికత్వానికి, పుష్టికి పురుషులకు సంకేతమైతే, ఐదవతనానికి, సౌభాగ్యానికి, స్థిరబుద్ధికి స్త్రీలకు సంకేతం. కుంకుమధారణ భారతీయ చిహ్నం. అది మన హిందూ సాంప్రదాయకం. పాశ్చాత్య పోకడలలో మనసాంప్రదాయకమును మర్చిపోకూడదు. మంచి పోస్ట్ పెట్టారు, అభినందనలు.

    రిప్లయితొలగించండి
  3. బొట్టు గురించి మంచి విషయాలను చెప్పారండీ..
    ధన్యవాదములు..

    రిప్లయితొలగించండి
  4. భారతి గారు
    శాస్త్రీయపరంగా మరిన్ని విషయాలను పంచుకున్నందుకు ధన్యవాదాలండి.

    రిప్లయితొలగించండి
  5. మంచి విషయం చెప్పారు లక్ష్మి గారు.
    కొన్ని విద్య సంస్థలలో వాళ్ళు పెట్టిన నిబంధనలని త్రోసి పుచ్చి మన సంప్రదాయం కాపాడుకోవాలి. అందుకు పోరాటం చేయాలి.

    రిప్లయితొలగించండి
  6. వనజ గారు,
    అలాంటి విద్యాసంస్థలకు పిల్లల్ని పంపేవాళ్ళు తప్పకుండా నిరసన తెలపాలి. వీలయితే ఆ విద్యాసంస్థల్లో పిల్లల్ని చేర్చకుంటే బాగుంటుంది.
    ధన్యవాదాలండి.

    రిప్లయితొలగించండి
  7. మంచి టపా. అభినందనలు.
    హిరోషిమా మీద అణుబాంబు వేసిన రోజిది.
    ప్రపంచశాంతిని కోరుకుందాం – యుద్దాలను వ్యతిరేకిద్దాం

    రిప్లయితొలగించండి
  8. అభినందనలమ్మా ! ఇలా ఆచారములకు సంబంధించిన విషయాలు విస్తౄతంగా ప్రచారం చేయాలి

    రిప్లయితొలగించండి
  9. నా భార్యా, కుతురు ఎప్పుడు బొట్టు పెట్టుకునే బయటకు వెళ్తారు. నాకు దేవుడి పట్ల నమ్మకం లేకపోయినా గుడికి వెళ్తే కుంకుమ బొట్టు పెట్టుకుంటాను.

    రిప్లయితొలగించండి
  10. దుర్గేశ్వర గారు,
    మీ ఆశీర్వాదం ఉంటే తప్పక చేస్తూ ఉండగలం. ధన్యవాదాలండి.
    నారాయణస్వామి గారు,
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  11. కృష్ణ గారు,
    మంచి విషయం చెప్పారు. పూజాదికాలప్పుడు తప్పని సరిగా నుదుట బొట్టు ఉండాలి. అదికూడా ప్లాస్టిక్ స్టిక్కర్ లాంటివి కాకుండా కుంకుమ, చందనం, విభూతి లాంటివి తప్పక ఉండాలి. ధన్యవాదాలండి.

    రిప్లయితొలగించండి