Loading...

25, జులై 2012, బుధవారం

కృష్ణాష్టమి శుభాకాంక్షలు!

కృష్ణాష్టమి వస్తున్న సందర్భంగా మిత్రులందరికీ శుభాకాంక్షలు!
శంకరాభరణంలో కాళియమర్దనము చిత్రము చూసి యిప్పుడు వ్రాసిన నా పద్యములివిగో!

పంచచామరము -

మదమ్ముతో చరించు సర్పమై విషమ్ము చిమ్మ, నీ
పదాళి తాండవమ్ము జేసె పంకజాక్ష! "శ్రీ హరీ!
త్వదీయ పాద తాడనమ్ము తాళజాల నం"చు నీ
పదమ్ము బట్టి వేడువాని పాలి దైవమైతివా!

తరళము -

కరుణ కన్నుల నిండియుండగ కంటి నిన్ను గదాధరా!
మరణ భీతిని నేర్పుతోడను మాపిగావుము శ్రీధరా!
సిరియు సంపదలిచ్చి మమ్ముల జేరదీయుము దేవరా!
వరము కోరగ వచ్చినారము, వాంఛితమ్మును దీర్చరా!

మత్తకోకిల -

విందు నేత్రములందు రీతిని వెల్గు వానికి మంగళం!
సుందరమ్ముగ ప్రేమరూపును జూపువానికి మంగళం!
మందహాసము తోడి శోకము మాపువానికి మంగళం!
నందనందనుడైనవానిని నమ్ము వారికి మంగళం!

16 కామెంట్‌లు:

  1. స్వామిని ఎలా చెప్పినా మధురమే

    రిప్లయితొలగించండి
  2. శర్మ గారు,
    పర్లేదు ఏదోలా చెప్పావు అంటున్నారా? :)
    మీలాంటి పెద్దవారు అంతమాత్రం అన్నా చాలు. అదే పదివేలు.
    ధన్యవాదాలండి.

    రిప్లయితొలగించండి
  3. పొరబడ్డారు, స్వామిని ఏ మాటలలో చెప్పినా మధురమే అన్నది నా ఉద్దేశం, పొరబడ్డానికి సావకాశం వచ్చినట్లు వ్యాఖ్య పెట్టినందుకు చింతిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  4. భలేవారే! మా రసజ్ఞ తాతగారి మనసేమిటో తెలియదా ఏమిటి? సరదాగా అలా వ్రాసి స్మైలీ కూడా పెట్టాను కదండీ, మీకు మరీ మరీ ధన్యవాదాలండి.

    రిప్లయితొలగించండి
  5. చిన్ని కృష్ణుని సంతసము చూడంగ పద్యములతో తోరణము కట్టి స్వామిని మెప్పించారు..మీక్కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలండీ..

    రిప్లయితొలగించండి
  6. మదమ్ముతో చరించు సర్పమై...
    చాలాబాగుంది....
    అ దేవదేవునికి అర్పించిన పద్యాభారణాలు
    కాంతులు వెదజల్లుతున్నాయి లక్ష్మి గారూ!
    ఆ నల్లనయ్య ఆశీస్సులు సదా మీ వెంట ఉండు గాక...
    @శ్రీ

    రిప్లయితొలగించండి
  7. సుభ గారు,
    చాలా రోజులు విరామం తీసుకున్నట్టున్నారు. మీ వ్యాఖ్య సంతోషాన్ని కలిగించింది. ధన్యవాదాలండి.

    రిప్లయితొలగించండి
  8. శ్రీగారు,
    చాలా సంతోషమైందండి. మీరు పద్యాలను లేదా తీయని తెలుగును ఎంతగా ఆస్వాదిస్తారో చక్కగా కనిపిస్తుంది. మీ మాటల్లో. ధన్యవాదాలండి.

    రిప్లయితొలగించండి
  9. చక్కగా రాశారు, అభినందనలు.
    పద్యాలు రాయాలంటే కష్టమేమో,ఎలా రాయగలరండి, అంత బాగా.

    రిప్లయితొలగించండి
  10. భాస్కర్ గారు,
    నేనూ ఈ మధ్యనే నేర్చుకొని ప్రయత్నిస్తున్నానండి. మీరు మెచ్చుకుని సంతోషపెట్టారు. ధన్యవాదాలండి.
    చిన్నప్పుడే నేర్చుకోలేదని ఇప్పుడెంత బాధపడుతున్నానో! నేర్చుకొని ఉంటే ఈ పాటికి కావ్యాలే వ్రాసేదాన్ని కాదా! :)

    రిప్లయితొలగించండి
  11. గోకుల కృష్ణ...గోపాలా కృష్ణా...నా మనసు ఆనంద డోలికలు ఊగింది
    బాగా వ్రాసారు

    రిప్లయితొలగించండి
  12. మీ వ్యాఖ్య కూడా నాకు ఆనందాన్ని కలిగించింది.శశికళ గారు, ధన్యవాదాలండి.

    రిప్లయితొలగించండి
  13. madam baagaa raasaaru, antha telivi ledu kaani ardam chesukogalanu

    రిప్లయితొలగించండి
  14. భలేవారే, మీకు చక్కగా అర్థం చేసుకునే శక్తి ఉందని నాకు తెలుసు లెండి.
    మీ స్పందనకు ధన్యవాదాలండి.

    రిప్లయితొలగించండి
  15. లక్ష్మీ దేవి గారు మన్నించండి మీరు పద్యం తో పాటు బావం కూడా వ్రాయండి మాలాంటి వారికి చదువుకొని అర్ధం సేసుకోగలం

    రిప్లయితొలగించండి
  16. తప్పకుండా ఈ సారి అలాగే చేస్తాను. ఇంత ఆసక్తి చూపినందుకు అభినందనలు. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి