Loading...

14, ఆగస్టు 2012, మంగళవారం

శ్రీలు పొంగిన జీవగడ్డై పాలు పారిన భాగ్యసీమై ....

శ్రీలు పొంగిన జీవగడ్డయి   పాలు పారిన భాగ్యసీమయి  
వరలినది ఈ భరత ఖండము,  భక్తి పాడర తమ్ముడా !(2)

వేద శాఖలు వెలసెనిచ్చట  ఆదికావ్యం బలరె నిచ్చట |
బాదరాయణ పరమఋషులకు పాదు సుమ్మిది తమ్ముడా ||శ్రీలు పొంగిన||

విపిన బంధుర వృక్ష వాటిక  ఉపనిషన్మధువొలికెనిచ్చట |
విపుల తత్వము విస్తరించిన  విమల తలమిది తమ్ముడా || శ్రీలు పొంగిన||

సూత్ర యుగముల శుద్ధ వాసన క్షాత్ర యుగముల శౌర్య చండిమ
చిత్ర దాస్యము చే చరిత్రల చెరిగిపోయెర తమ్ముడా || శ్రీలు పొంగిన||

మేలి కిన్నెర మేళవించీ రాలు కరుగగ రాగమెత్తి
పాలతీయని బాలభారత పథము పాడర తమ్ముడా|| (శ్రీలు పొంగిన)||

దేశగర్వము దీప్తి చెందగ దేశచరితము తేజరిల్లగ |
దేశమరసిన ధీరపురుషుల తెలిసి పాడర తమ్ముడా || (శ్రీలు పొంగిన)||

పాండవేయుల పదునుకత్తులు మండి మెరిసిన మహితరణ కధ |
కండగల చిక్కని పదంబుల కలిపి పాడర తమ్ముడా|| (శ్రీలు పొంగిన)||

                                                 ---రాయప్రోలు సుబ్బారావు.

ఈ పాట ఇక్కడ వినండి.

7 కామెంట్‌లు:

  1. మంచి దేశ భక్తి గీతం రాయప్రోలు సుబ్బారావు గారి రచన...
    మీకు కూడా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
    లక్ష్మీ దేవి గారూ!
    @శ్రీ

    రిప్లయితొలగించండి
  2. లక్ష్మీ గారు. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు..

    రిప్లయితొలగించండి
  3. మీకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు..

    రిప్లయితొలగించండి
  4. శ్రీ గారు,
    రచయిత పేరు చెప్పి మంచి పని చేశారు. ఇప్పుడే చేరుస్తాను. ధన్యవాదాలండీ.

    రిప్లయితొలగించండి
  5. వనజా వనమాలి గారు,
    రాజి గారు,
    చాలాచాలా ధన్యవాదాలండి.

    రిప్లయితొలగించండి
  6. మంచి సాంగ్ అండి మొదటి చరణము మాత్రమే తెలుసు... అది కూడా లీడర్ మూవీ లో విన్నాను సాంగ్ మొత్తం తెలియపరచినారు చాలా చాలా ధన్యవాదములు అండి...

    రిప్లయితొలగించండి
  7. సంతోషమండి. ఈ మధ్య బ్లాగుకు కొంచెం విరామమిచ్చినట్టున్నారు!!

    రిప్లయితొలగించండి