Loading...

18, జనవరి 2012, బుధవారం

సూర్యుని వర్ణన _ రంగుల జానపదం(వీడియో లంకె)

సూర్య దేవుని అనునిత్యం స్మరించి కృతజ్ఞతలు చెప్పుకోవటంఅదీ సూర్యస్తుతికి ఉత్కృష్టమైన ఈ ఉత్తరాయణ ఆరంభంలో.... సర్వ జీవరాశి కి ప్రథమ కర్తవ్యము. సూర్య దేవుని తెల్లని కిరణములో నుంచి అన్ని రంగులు ఉద్భవించినాయంటారు. అలాంటి సూర్యుడు ఆకాశంలో పొద్దున్నుంచీ సాయంత్రం వరకు ఎన్ని రంగులు చూపిస్తాడో , ఎన్నెన్ని పువ్వులతో వర్ణించారో ఈ పాటలో చూడండి. ఇన్ని రంగుల పూలు ఈ లోకంలో పూస్తున్నాయంటే కారణం ఆ పొద్దు పొడుపు వాడే కదూ!
శ్రీ సాయి పదము వారు పంపించిన మెయిల్ లో వచ్చింది. వారికి , పాడిన లక్ష్మి గారికి ధన్యవాదాలు.

"ఉదయ భానునితో మేలుకొలుపు గా ప్రారంభమైన వర్ణన అస్తమాన బాలునివరకూ  -
ఒక్కొక్క స్థితి లో స్వామి వర్ణాన్ని చెప్పడానికి వాడిన ఉపమానాలు
అద్భుతం.   మాఘ మాసమంతా ఆ సూర్యదేవుని స్తుతి స్తోత్ర మాలికలో  ఇది కూడ
పఠించి సర్వ శుభాలు పొందెదరు  గాక." ఈ జానపదానికి వీడియో క్రింది లింకులో
చూడండి.
http://www.youtube.com/watch?v=4hWpHpwHU3U

శ్రీ సూర్యనారాయణ స్వామి - మేలుకొలుపు పాట

శ్రీ సూర్యనారాయణ మేలుకో హరిసూర్యనారాయణ || 2 ||

పొడుస్తూ భానుడూ పొన్న పువ్వు ఛాయ
పొన్నపువ్వు మీద పొగడపువ్వు ఛాయ ||శ్రీ సూర్య ||

ఉదయిస్తూ భానుడు ఉల్లిపువ్వు ఛాయ
ఉల్లిపువ్వుమీద ఉగ్రంపు పొడిఛాయ ||శ్రీ సూర్య ||

గడియెక్కి భానుడు కంబపువ్వు ఛాయ
కంబపువ్వు మీద కాకారీ పూఛాయ||శ్రీ సూర్య||

జామెక్కి భానుడు జాజిపువ్వు ఛాయ
జాజిపువ్వుమీద సంపంగీ పూఛాయ||శ్రీ సూర్య||

మధ్యాహ్న భానుడు మల్లెపువ్వు ఛాయ
మల్లెపువ్వుమీద మంకెన్న పూఛాయ||శ్రీ సూర్య||

మూడుఝాముల భానుడు ములగపువ్వు ఛాయ
ములగపువ్వుమీద ముత్యంపు పొడిఛాయ||శ్రీ సూర్య||

అస్తమాన భానుడు ఆవపువ్వు ఛాయ
ఆవపువ్వుమీద అద్దంపు పొడిఛాయ||శ్రీ సూర్య||

వాలుతూ భానుడు వంగపువ్వు ఛాయ
వంగపువ్వుమీద వజ్రంపు పొడిఛాయ||శ్రీ సూర్య||

గుంకుతూ భానుడు గుమ్మడిపూఛాయ
గుమ్మడిపువ్వుమీద కుంకంపు పొడిఛాయ||శ్రీ సూర్య||




9 కామెంట్‌లు:

  1. are ee paata naaku koodaa ishtam.raagam yekkado jnaapakaalalo undipoyindi...gurtuku raavatam ledu...thanx for remembering this

    రిప్లయితొలగించండి
  2. శశికళ గారు, ధన్యవాదాలండి.
    ఈ పాట వీడియో లింక్ ఇచ్చాను కదా , ఒక్కసారి చూడండి. ఎంత ఆహ్లాదకరంగా కూర్చారో!

    రిప్లయితొలగించండి
  3. చాలా మంచి పాటను మా ముందుకు తీసుకుని వచ్చారండీ! ఈ పాట మొదటి లైను చూసి భానుమతి గారు మంగమ్మ గారి మనవడు సినిమాలో పాడిన పాటనుకున్నాను. పూర్తిగా చూస్తే కాదు. చాలా బాగుందండీ! మీకిన్ని ఎక్కడ దొరుకుతాయి?

    రిప్లయితొలగించండి
  4. రసజ్ఞ గారు, ధన్యవాదాలు.
    సినిమాల్లో మంచి పాట పదాల్ని ఇష్టం వచ్చినట్టు వాడుకొని వాటికున్న పేరు, మర్యాదను పోగొట్టేస్తున్నారండీ. ఏం చేద్దాం. ఇది ఎక్కడ దొరికిందో చెప్పాను కదండీ పైన. వీడియో నాకూ చాలా నచ్చింది.

    రిప్లయితొలగించండి
  5. మందాకినీ గారు చాలా మంచి జానపదమును అందించారు .ధన్యవాదములు. ప్రతి ఆదివారం,అప్పుడప్పుడు మిగతా రోజుల్లోనూ దాదాపు ముప్పయి ఏళ్ళుగా ఉదయాన్నే ఈ పాట వింటున్నా వింటున్న ప్రతి సారి చాలా ఆనందం. ఆకాశవాణిలో.. ఈ పాట వినిపిస్తారు. ఇదే పాటని మాగంటి వంశీ మోహన్ గారు రెండు సార్లు పరిచయం చేసారు. పాట సాహిత్యం అందించి మంచి పని చేసారు. మీకు హృదయ పూర్వక ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  6. వనజ గారు,
    ఎన్ని సార్లు విన్నా, కన్నా తనివితీరని అందాలను ప్రకృతి ప్రతిరోజూ కొత్తగా అందించటం, కవులు మనోజ్ఞంగా వర్ణించటం మన అదృష్టం.

    రిప్లయితొలగించండి
  7. ధన్యవాదములు మందాకిని గారు.
    నా చిన్నప్పుడు "ఆకాశవాణి విజయవాడ" కేంద్రం నుండి ప్రొద్దునే వచ్చేది. చాలా ఇష్ఠమయినది. నా దగ్గర MP3 ఉన్నది.

    రిప్లయితొలగించండి
  8. మూర్తిగారు,
    అందరినీ ఆకర్షించిన పాట యిది. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి