Loading...

20, నవంబర్ 2022, ఆదివారం

మాలిక

 పదములు వెల్లువై యురుకఁ బద్యము కాదు, సుమా రసజ్ఞునిన్

హృదయములుల్లసమ్మలర హృద్యము, స్వారసబంధురమ్ముగా

ముదమునొసంగగావలయు, ముచ్చట మీర ధ్వనించి వేడుకల్

సదమలమైన భావఝరిసంపదతోడ రచింప, మెల్లగా

మృదువగు రీతిగా నడచి మేలిమి శైలిని సాగుచుండ, నె

ట్లొదుగునొ యట్టి తీరుననె యుద్ధతిఁ జూపి, యడంగి, యే స్థితిన్

కదలగనొప్పునో తెలిసి  కందువ తీర్చినఁ, బాఠకాదులం

జదువగఁ జేయు, పద్యముల సౌరును నింపుగఁ గాంచి విజ్ఞతన్

కొదవలఁ దోషలోపములఁ గూర్పుగ నేర్పుగ నెత్తి చూపుచో

చెదరని యాత్మ స్థైర్యమున సిద్ధము కావలె, నాణ్యమైనదై

కుదురగు పద్యమల్లుకొన ఘుమ్మను పువ్వులఁ గూర్చినట్టుగా

చదువుల తల్లి చల్లనగు చక్షువుదీవనలిచ్చి మెచ్చగా.


--లక్ష్మీదేవి 

చంపకమాలిక 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి