Loading...

30, నవంబర్ 2022, బుధవారం

లుప్తమై

 శోసంవర్ధమై సుప్తసంగీతమై
యేమై నిక్కమై యిష్టసంతాపమై
మోరిల్లేనిదే మూగయౌ రాగమై
లోవృత్తిన్ సదా లుప్తమై పోవుచున్

- లక్ష్మీ దేవి 
స్రగ్విణీ.

శూన్యం

 పోరాటమ్మే బ్రదుకు పథమై పూర్వకర్మాశ్రితమ్మై

ఆరాటమ్మే పలుకు పదమై యంతరంగాశ్రితమ్మై

సారమ్మేమో యెఱుగగలిగే సత్త్వమే శూన్యమైనన్

భారమ్మెంతో! పయనమగుదున్ పంతమున్ వీడకుందున్


--లక్ష్మీదేవి 

మందాక్రాంతము 

29, నవంబర్ 2022, మంగళవారం

అంతయు

 ధనములు నాస్తిపాస్తులును దండిగ నున్నను, లేని చోటులన్

మనమున సంకటమ్ములను మాయము చేయగ శక్తి లేనివీ

జనుమలు మానవాళివని సంయమమొప్పగ నుండనోపు, కా

దనగల వీలులేదనగ నంతయు మార్చు సమర్థులేరిటన్?


-- లక్ష్మీదేవి

చంపకమాల 

ధాత్రి

 నిపచ్చందనమెల్ల పత్రములలో భాస్వంతమై చెల్గెనో

నీలమ్ములునల్లదో గగనమై గాఢమ్ముగా వెల్గెనో
మినుకుందెల్పుల ఫేనమా కడలిపై మెమ్మేటిగా చిందెనో
నువిందైనవి వన్నియల్ సొబగు సింగారమ్ములిద్ధాత్రిపై.

--లక్ష్మీదేవి 
మత్తేభవిక్రీడితము 

28, నవంబర్ 2022, సోమవారం

నిర్వేదము

 దుర్వారమ్ము నిరాశ జీవనమునన్ దుఃఖంపు సాంగత్యమై

ర్వమ్మెల్ల నడంగఁజేయును సదా ల్లోల మందుంచుచు
న్నిర్వేదమ్మును సాధనమ్ముఁగ, నిదో నేనిట్లు సాగింతు నా
నిర్వాణంపు ప్రయాణమున్ ధరణిలో నిక్కంపు ధైర్యమ్ముతో.

కృష్ణ గాథ

 జ్వికాని చరిత్రమైనది కృష్ణ గాథ ల గుచ్ఛమై

యుజ్వలోరస మాధురీగుణయుక్తమై వ్రజవాసమై

ప్రజ్వలించెను సాంద్రనీలము క్తి కావ్యములందు, మా

హోజ్వలమ్ముగ మానవాళిని యుద్ధరించెడు కాంతియై.

-లక్ష్మీదేవి 
మత్తకోకిల.

నీలమణి

 ఉజ్జ్వల నీలమైన మణి నూరక పేరు వినంగనెంతగా

నుజ్జ్వలమైన భావనలు, నుద్ధృతియుం గలుగంగఁ; జాలునే

యుజ్జ్వల సూర్యబింబములనొప్పుగ మించిన కాంతిముందు? నీ

యుజ్జ్వలితమ్ములున్ మిణుగులో, మరి యంతకుఁ జాలవోకదా! 


--లక్ష్మీదేవి 

ఉత్పలమాల 

27, నవంబర్ 2022, ఆదివారం

అజ్ఞానప్రదర్శన

 ప్రజ్ఞాపాటవమంచు నేది తన లోపమ్మైన, నెంతైన తా

నజ్ఞానమ్మున నుండుటే యెఱుగకున్నట్లైన, పంతమ్ముతో

విజ్ఞానంపు ప్రదర్శనాభిరుచితో పేట్రేగి పోచున్నచో

నే జ్ఞానుల్ వివరించి చెప్పగలవారింకేమి కానున్నదో!!

--లక్ష్మీదేవి 

శార్దూలవిక్రీడితము. 


సద్ధర్ములు

 ర్మలనాచరించుటను కామితమెయ్యది లేని తీరులో

నిర్మమమౌ విధమ్మునొక నిక్కపు జీవనమెల్ల సాగగా
నిర్మలమైన మానసము, నీమము నాచరణమ్మునుండు స
ద్ధర్ములు నెవ్వరుందురని ధాత్రియు నిత్యము చూచుచుండునో?

25, నవంబర్ 2022, శుక్రవారం

నిల్వగలేక

 చెల్వము శోభిలంగ శశి చిన్ని స్వరూపముఁ గానకుండగా
నిల్వగలేని వారలల నింగినిఁ జూచుచు వేచి యుండ, నే
ల్వురొ వట్టి నీరసులు వ్వుదురేని రసజ్ఞులట్టిచో
గెల్వగ వాదులాడరు, నొకింతగ జాలినిఁ బొంది వారిపై.

--లక్ష్మీదేవి 

24, నవంబర్ 2022, గురువారం

కాలము

 విశ్వములోనిమాయలను వేడుకఁ జూచుచుఁ బొద్దుఁ బుచ్చుచున్

శ్వరమైన వింతలను మ్మగఁ జాలక చర్చఁ జేయుచు
న్నిశ్వసనమ్ములందుననె నెట్టుచునుందుము కాలమున్ కదా!
శ్వపు వేగమందుకొని యందక నెట్లది చెల్లిపోవునో!

--లక్ష్మీదేవి 
ఉత్పలమాల 

22, నవంబర్ 2022, మంగళవారం

నీలిసముద్రం

 వినీలమైన క్లేశరాశి పేరుకున్నరూపమై,
వినోదచేష్ట ,తీరమందు వీచిపొంగు భంగియై
వినూతనంపురూపు గల్గి విస్తరించి యుండు, నీ
నోసముద్రమంతరంగమౌనమై గభీరమై.

--లక్ష్మీదేవి 
పంచచామరము. 

20, నవంబర్ 2022, ఆదివారం

మాలిక

 పదములు వెల్లువై యురుకఁ బద్యము కాదు, సుమా రసజ్ఞునిన్

హృదయములుల్లసమ్మలర హృద్యము, స్వారసబంధురమ్ముగా

ముదమునొసంగగావలయు, ముచ్చట మీర ధ్వనించి వేడుకల్

సదమలమైన భావఝరిసంపదతోడ రచింప, మెల్లగా

మృదువగు రీతిగా నడచి మేలిమి శైలిని సాగుచుండ, నె

ట్లొదుగునొ యట్టి తీరుననె యుద్ధతిఁ జూపి, యడంగి, యే స్థితిన్

కదలగనొప్పునో తెలిసి  కందువ తీర్చినఁ, బాఠకాదులం

జదువగఁ జేయు, పద్యముల సౌరును నింపుగఁ గాంచి విజ్ఞతన్

కొదవలఁ దోషలోపములఁ గూర్పుగ నేర్పుగ నెత్తి చూపుచో

చెదరని యాత్మ స్థైర్యమున సిద్ధము కావలె, నాణ్యమైనదై

కుదురగు పద్యమల్లుకొన ఘుమ్మను పువ్వులఁ గూర్చినట్టుగా

చదువుల తల్లి చల్లనగు చక్షువుదీవనలిచ్చి మెచ్చగా.


--లక్ష్మీదేవి 

చంపకమాలిక 

19, నవంబర్ 2022, శనివారం

నిర్లక్ష్యం

 దుర్లేఖ్యములని, చూచుచు
నిర్లక్ష్యముఁ జేయుచుండ, నిర్వేదములో
దుర్లక్షమైన లక్ష్యము
దుర్లంఘమునై యిపుడిది దుర్దినమయ్యెన్

18, నవంబర్ 2022, శుక్రవారం

విరాగమే

 నిరాదరించుచో జగత్తు నిర్వికారమొక్కటే
ణ్యమౌనులే నిరాశ స్వాంతమందదేల? నీ
విరాగమే సరైనదౌను వీడి సాగిపో సదా
బిరాన కాలమెల్ల చెల్లు భిన్నమైన రీతిలో

--లక్ష్మీదేవి 
పంచచామరము 

17, నవంబర్ 2022, గురువారం

మౌనసంగీతం

 

నిస్తారము

 విస్తారంగా పలుకుపదమౌ వేదముం కావ్యమెల్లా
స్తూరిశ్రీ తిలకధరుడా కంజనేత్రుండె గాడో!
నిస్తారమ్మౌ పథమునరుగన్నిబ్బరమ్మెట్టులైనన్
న్యస్తమ్మట్లీ మనమునిడగా నాథుడెట్లైన రాడో!

-లక్ష్మీదేవి 
మందాక్రాంతము 

పఠనము

 ఠినములౌపద్యములను
మునఁదెలియంగఁదలతు, సాధింపంగా
విలా, దీవననొసగుము
నములో తోడునిలుము థమునుఁగనఁగా

--లక్ష్మీదేవి 
కందము 

16, నవంబర్ 2022, బుధవారం

నిర్వేదం

 ర్వాణీసుతుడై చెలంగునతనిన్ ద్బుద్ధినిమ్మంచు నేఁ

ర్వమ్మందున నర్చనల్ సలుపగా ప్రార్థించగా నిచ్చెనా
దూర్వాయుగ్మముతోగణేశుడు సదా తోషమ్మునందున్ గదా!
నిర్వేదమ్మున వ్యర్థమంచు తలతున్నేడిట్లదేమైనదో!

--లక్ష్మీదేవి 
శార్దూలవిక్రీడితము 

అందము

 చిత్తడినేలలోనరక జృంభణమొప్పగ దున్నినాటినన్

విత్తులు మొక్కలై ఎదిగి పెంపులు మీరగ పండినంత, కొం
గ్రొత్తగ కానవచ్చె ,చిరు గువ్వలు పువ్వుల వోలె వాలగా
చిత్తరువన్న తీరునది చిందినదందము కన్నువిందుగా.

--లక్ష్మీదేవి 
ఉత్పలమాల 

మాధురులు

 దిలో కల్పనఁజేసినట్టి తరి మర్మమ్మైన సందేశమై,
మై పల్క గదే, నితాంతముగ భావావేశమందొప్పు నా
హృదినాధారమవైన ధారవుగ, నా హృద్యంపు పద్యమ్ముగా
ళీపాకమువోలె మాధురులు పొంగారంగ దీవింపుమా!

--లక్ష్మీదేవి 
మత్తేభవిక్రీడితము 

14, నవంబర్ 2022, సోమవారం

దీక్ష

 దువుల సారమెల్లఁగన క్తినొసంగుము శారదాంబికా!

లని దీక్షనిచ్చి నను కంకణబద్ధగ నుండనిమ్ము, నీ
నపు లోకసీమఁ గల య్యములంబడి యేగు తత్వమున్
లగఁజేయుమందు, నొగి వ్యపథమ్మునుఁజూపమందు నిన్.

--లక్ష్మీదేవి 
చంపకమాల. 

కాలము

 కాము చెల్లఁజేయు మన గందరగోళములెల్లతీరులన్

మేలిమియైనరీతులను మించినపద్ధతి నేర్పుచుండు, పో
జాని కష్టమైన కొనసాగెడు బాధలనైన మాయగా
తేలిక చేసిపోవునిది, దివ్యమహౌషధమియ్యదొక్కటే

జ్వాల

 కామ్మెల్ల యుగాలుగా వెలిగితే కాంతిస్వరూపమ్ముగా !
జ్వాలారూపిగ వెల్గితే నరుల క్షుద్బాధన్నివారింపగా !
నీలాభ్రారుణ వర్ణమై క్రతువులన్నిత్యాగ్నివై వెల్గితే !
ఫాలాలంకృత దీపమై వెలిగితే వ్యార్చనాదీక్షలో.

--లక్ష్మీదేవి 
శార్దూలవిక్రీడితము 

13, నవంబర్ 2022, ఆదివారం

సంధ్యా సమయం

 వింధ్యాపర్వత శ్రేణిలో యడవిలో భృంగాళితోఁ బాటుగా,

సంధ్యారాగముఁదీసెనీ యిరులహా సంగీతమైతోచగా,
సంధ్యాదీపము చంద్రుఁడై వెలిగెనే సౌందర్యమై, యచ్చటే
వింధ్యావాసిని పెట్టెనో ప్రమిదలో వెల్గొందు దీపమ్ముగా.

--లక్ష్మీదేవి 
శార్దూలవిక్రీడితము. 

11, నవంబర్ 2022, శుక్రవారం

కొత్త వృత్తము

 పుస్తకమ్ములందొక్కటైన నేఁ బూర్తిచేయగా జన్మచాలునా?

మస్తకమ్మునన్నిల్చియుండగా మర్మమైనదౌ యర్థమందునా?

విస్తరమ్ముగా నెల్ల రీతులన్ విద్య సంపదై నాకు దక్కునా?

అస్తమించుచో జీవనమ్ము, నీ యాత్మతృప్తిగా నిష్క్రమించునా?


--లక్ష్మీదేవి 

9, నవంబర్ 2022, బుధవారం

లయగ్రాహి

 మాలి యొకడుండెనట, పూతలఁబెంచెనట, మేలి విధ గంధములు గాలులను నిండెన్.

కేలఁగొని యల్లుకొని మాలుగ కూర్చుకొని కాలినడ కోవెలకు మాలి చనె భక్తిన్.
బాలును పెద్దలును వేలుపుల పూజలనుఁ గోములనాడిరట, చా కనువిందుల్.
రాలినవి పూలచట తేలినవి వాగునల సోలినవి వాడినవి చాలునట జన్మల్.

--లక్ష్మీదేవి 
లయగ్రాహి.