Loading...

12, ఏప్రిల్ 2012, గురువారం

గజేంద్రుని ఆర్తి (నా పద్యములు)



పెద్దలకు నమస్కారము. 
గజేంద్రుని ఆర్తికి పద్యరూపం ఇచ్చెందుకు ప్రయత్నించాను.

ఇందులో కథ వివరంగా చెప్పలేదు. క్లుప్తంగా విషయం చెప్పాను. 
పెద్దల సూచనలు శిరోధార్యము.


చదువును జ్ఞానమునొసగి 
రి దయను గణపతియువాణిరేపవలును నా
మది వీడక కొలువుండగ
కుదురగు బుద్ధిని నిలుపగ కోరుచు నుందున్.


పరుగున నేతెంచి కరిని
హరి గాచిన తీరు యబ్బురమ్మది భువిలో
విరుగగ పాపపు చయములు
సరసముగా జెపుదు నిపుడు ఛందోరీతిన్.

పన్నగశయనుడవయి నెల
కొన్న కమల నయనుడయిన గోవిందాయా
పన్నుల గాచెడు దయ నీ
కున్నదనుచు నమ్మె యేనుగు తనదు మదిలో

స్థానబలముగల మకరమ
దేనుగు పాదమును బట్టి యీడ్చ,మడుగులో
తానే పోరెదననుకొని
దీనత పొందక జతనము తీరుగ చేసెన్.

కడకా గజమది యోడుచు
మడుగున నిన్నే పిలిచెను మాధవదేవా!
"వడివడిగా వచ్చి నిలిచి
విడు నీ చక్రముననుచును వేడెను తానే.

"సృష్టికి నీవే మూలము
భ్రష్టుడనైతిని తెలియక బ్రతుకుననెంతో
నష్టము పొందితి తండ్రీ!
కష్టము గట్టెక్క నన్ను కావగదయ్యా!"

జనకుండెవ్వరు ప్రాణికి,
జననియదెవ్వరుపతియునుజాయయదెవరో,
కనగా సంతును స్వంతమె?
యని నాకు కలుగగ చింతలచ్యుతనాథా!"

ఆదియునంతము నీవే
నాదనుదేమియును లేదునమ్మితి"ననగా
సాదరముగ కదలి కరిని
నీ దరి చేర్చి కరుణింప నీవేగితివే!

పాపపు చీకటులు తొలుగ
దీపము నీవైన కథల దెలుపుచునన్నున్
కాపాడెడు దైవమగుచు,

గోపాలావందనమిదె గొనుమాకృష్ణా!

------------------------లక్ష్మీదేవి.

8 కామెంట్‌లు:

  1. కందమునందముగానా
    నందమునందందగింపనడపుచు కవితా
    విందొనగూర్చిన లక్ష్మీ!
    అందుమునేనందజేయుఅభినందనలన్

    రిప్లయితొలగించండి
  2. ధన్యవాదములండీ, అక్కడా, ఇక్కడా కూడా పద్యరూపంలోమీ వ్యాఖ్య ఆనందం కలిగించింది.

    రిప్లయితొలగించండి
  3. ఇలా పద్యాలు ఎలా వ్రాస్తారో నాకు తెలియదు .అసలా పదాలన్ని అలా అలవోకగా ఎలా వస్తాయి .మీ గజేంద్ర మోక్షం చాలా బాగుందండి.

    రిప్లయితొలగించండి
  4. రవిశేఖర్ గారు,
    చాలా సంతోషమండి . ధన్యవాదాలు.
    మంచి కవితలు వ్రాస్తారు కదా మీరు. ఛందస్సు తెలుసుకుంటే పద్యాలు వ్రాయవచ్చు. అంతే.

    రిప్లయితొలగించండి
  5. చాలా బాగుంది లక్ష్మి గారూ!
    @శ్రీ

    రిప్లయితొలగించండి
  6. గజేంద్రుని కనులెదుట నిలిపి ఒకమారు మది వాకిట మదురమైన పద్య తోరనమున్ కట్టిన మీ చాతుర్యమేల పొగడుదు లక్షీ దేవీ .., వెండి పళ్ళెంలో వెన్న ముద్దల్లా ఉన్నాయి మీ పద్యాలు, చాలా రుచిగా ఉన్నాయి లక్ష్మి గారూ

    రిప్లయితొలగించండి
  7. మీ మాటలూ మధురంగా ఉండి సంతోషపరిచాయండీ! ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి