Loading...

27, మార్చి 2012, మంగళవారం

తెలుగులో హనుమాన్ చాలీసా---- యెమ్మెస్ రామారావు రచన పూర్తి పాఠం

https://www.youtube.com/watch?v=wqvh1K_bKOs

https://www.youtube.com/watch?v=1vQKzSxnr4g

శ్రీ హనుమాను గురుదేవు చరణములు
ఇహపర సాధక శరణములూ
బుద్ధిహీనతను కలిగిన తనువులు
బుద్బుదములని తెలుపు సత్యములు        ||శ్రీ||

౧.} జయ హనుమంత జ్ఞానగుణవందిత
జయపండిత త్రిలోక పూజితా
౨.} రామదూత అతులిత బలధామా
అంజనిపుత్ర పవనసుతనామా
౩.} ఉదయభానుని మధురఫలమని
భావనలీల అమృతమును గ్రోలిన
౪.} కాంచనవర్ణ విరాజితవేషా
కుండలమండిత కుంచితకేశా
౫.} రామసుగ్రీవుల మైత్రిని గొలిపి
రాజ పదవి సుగ్రీవున నిలిపి
౬.} జానకీపతి ముద్రిక తోడ్కొని

జలధి లంఘించి లంక చేరుకొని
౭.} సూక్ష్మరూపమున సీతను జూచి
వికట రూపమున లంకనుగాల్చి
౮.} భీమరూపమున అసురుల జంపిన
రామకార్యముసఫలము జేసిన                ||శ్రీ||

౯. } సీతజాడ గని వచ్చిన నినుగని
శ్రీరఘువీరుడు కౌగిట నినుగొని
౧౦) సహస్ర రీతులా  నిను కొనియాడగ
 కాగల కార్యము  నీపై నిడగా
౧౧) వానర సేనతో  వారిధి దాటి
 లంకేశుని తో  తలపడిపోరి
౧౨) హోరు  హోరున  పోరు సాగినా
 అసుర  సేనల  వరుసన గూల్చిన           !!శ్రీ!!

౧౩) లక్ష్మణ  మూర్చతో  రాముడడలగా
 సంజీవి తెచ్చిన ప్రాణ ప్రదాత
౧౪) రామ లక్ష్మణుల  అస్త్ర ధాటికి
 అసుర వీరులు  అస్తమించిరి
౧౫) తిరుగులేని  శ్రీ  రామ భాణమూ
 జరిపించెను  రావణ  సంహారము
౧౬) ఎదిరి లేని ఆ లంకాపురమున
 ఏలికగా  విభీషణు  చేసిన               !!శ్రీ!!

౧౭) సీతా రాములు  నగవుల గనిరి
 ముల్లోకాల  ఆరతులందిరి
౧౮) అంతులేని  ఆనందాశృవులే
 అయోధ్యాపురి  పొంగిపోరులే
౧౯) సీతా రాముల  సుందర  మందిరం
 శ్రీకాంతు  పదం  నీ హృదయం
౨౦) రామ చరిత  కర్ణామృత గానా
 రామ నామ  రసామృత పాన              !!శ్రీ!!

౨౧) దుర్గమమగు ఏ  కార్య మైనా
 సుగమమే యగు  నీ కృపచాలిన
౨౨) కలుగు  శుభములు  నిను  శరణన్నా
 తొలగు  భయములు  నీ రక్షణ యున్నా
౨౩) రామ  ద్వారపు  కాపరి వైన నీ
కట్టడి మీర బ్రహ్మాదుల తరమా
౨౪) భూత పిశాచ  శాకినీ    డాకిని
 భయపడి  పారు నీ  నామ  జపము  విని           !!శ్రీ!!

౨౫) ధ్వజావిరాజా  వజ్ర శరీర
 భుజ బల తేజా  గదాధరా
౨౬) ఈశ్వరాంశ   సంభూత పవిత్ర
 కేసరీ పుత్రా  పావన గాత్ర
౨౭) సనకాదులు  బ్రహ్మాది దేవతలు
 శారద  నారద  ఆది  శేషులూ
౨౮) యమ కుబేర  దిక్పాలురు కవులూ
 పులకితులైరి నీ కీర్తి  గానముల            !! శ్రీ!!

౨౯) సోదర భరత  సమానాయని
 శ్రీ రాముడు  ఎన్నికగొన్న  హనుమా
౩౦) సాధుల  పాలిట  ఇంద్రుడ వన్నా
 అసురుల  పాలిట  కాలుడవన్నా
౩౧) అష్ట  సిద్ధి  నవనిధులకు దాతగా
 జానకీమాత  దీవించెను గా
౩౨) రామ రసామృత  పానము చేసిన
 మృత్యుంజయుడవై   వెలసినా              !!శ్రీ!!

౩౩) నీ నామ  భజన  శ్రీ  రామ  రంజన
 జన్మ  జన్మాంతర  దుఖ భంజన
౩౪) యెచ్చ టుండినా  రఘువరదాసు
 చివరకు రాముని  చేరుట తెలుసు
౩౫) ఇతర చింతనలు  మనసునమోతలు
 స్థిరముగా మారుతి సేవలు సుఖములు
౩౬) ఎందెందున  శ్రీ  రామ  కీర్తన
 అందందున  హనుమాను  నర్తన               !!శ్రీ!!

౩౭) శ్రద్ధగ దీనిని  ఆలకింపుమా
 శుభమగు ఫలములు  కలుగు సుమా
౩౮) భక్తిమీరగ  గానము సేయగ
 ముక్తి  కలుగు  గౌరీశులు   సాక్షిగా
౩౯) తులసిదాస  హనుమాను  చాలీసా
 తెలుగున  సులువుగ  నలుగురు పాడగ
౪౦) పలికిన  సీతారాముని   పలుకున
    దోసములున్న  మన్నింపుమన్నా             !!శ్రీ!!

మంగళ  ఆరతి  గొను  హనుమంతా
 సీతా రామ  లక్ష్మణ  సమేతా
నా అంతరాత్మ  నేలుమో  అనంతా
 నీవే అంతా  శ్రీ  హనుమంతా  ...ఆ ఆ .............
ఓం  శాంతి  శాంతి  శాంతి:.




12 కామెంట్‌లు:

  1. m.s.rama rao gari hanuman chalisa adieo kavali.unte cheppandi nenu download chesukuntanu.

    రిప్లయితొలగించండి
  2. Copy chesukonela icchunte chala bagundhi.

    Thanks
    SAM

    రిప్లయితొలగించండి
  3. రామరామ రఘురామ అని పాడుతున్న హనుమా
    అంతభక్తి పరవశమా ఓ కంటమమ్ము గనుమా

    రిప్లయితొలగించండి
  4. లక్ష్మి గారు,
    ఆడియో వెతికి లంకె ఇస్తానండి.
    సమయం దొరకగానే.....:)
    ధన్యవాదాలండి.

    రిప్లయితొలగించండి
  5. అజ్ఞాత గారు,
    కాపీ చేసుకోవచ్చు. కొంచెం ఆలోచించి ప్రయత్నించిచూడండి.
    ధన్యవాదాలండి.

    రిప్లయితొలగించండి
  6. చాలా కాలంనుండి దీని గురించి వెతుకుతున్నాను. ధన్యవాదాలు మందాకినిగారూ..!

    రిప్లయితొలగించండి
  7. శర్మ గారు,
    చాలా సంతోషం. నేనూ చాలా రోజుల్నించీ టీవిలో వినేప్పుడు రాసుకుందామంటే కుదర్లేదు. చివరకు ఒక గ్రూప్ మెయిల్ లో వచ్చింది. చాలా సంతోషించి, నాలాంటివారు ఉంటారనే ఇక్కడుంచా.
    ఫలితం వచ్చింది.
    ధన్యవాదాలండి.

    రిప్లయితొలగించండి
  8. సంతోష్ బండి30 మార్చి, 2012 12:26 AMకి

    ఒరిజినల్ చాలీసా తెలుగు లో వ్రాసినది ఉంటె పొస్ట్ చెయ గలరు

    రిప్లయితొలగించండి
  9. నిజమేనండీ, ఇది పూర్తిగా హిందీలో శ్రీమాన్ తులసీదాసు రచించిన చాలీసా కు అనువాదము. తెలుగులో ఎవరైనా వ్రాశారంటారా? నాకు తెలిసి ....లేదు.
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  10. Hi mandakinii H R U ?

    nee BLOG lO annii chaalaa baagunnaayi
    hanumanchaliisa superb nee Sramaku thanks

    chinna manivi...nee blog templates link kaasta ivvavu..pleas...naaku baagaa nachindi..adikaaka 3column to marii baagundi..ilaa adigaanani emi anukoku..happy Hanummajayanti subhakankshalatO

    prEmatO...
    sunderpriya

    రిప్లయితొలగించండి
  11. ప్రియ గారు,
    మీ ప్రియమైన పలుకులతో చాలా సంతోషం కలిగించారు. ధన్యవాదాలు.
    ఈ టెంప్లేట్ బ్లాగర్ వాడిచ్చిందే నండి. నేను కొత్తగా ఎక్కడినుంచో తీసుకురాలేదు.
    మీరు సైన్ ఇన్ అయ్యాక మీ బ్లాగ్ లేఅవుట్ లోకి వెళ్ళి టెంప్లేట్ డిజైనర్ అనే లంకె నొక్కండి.
    అందులో awesome అనే టెంప్లేట్ లోని పలు రకాల్లో ఈ డిజైన్ ని సెలెక్ట్ చేసుకుని బ్లాగ్ కి వర్తించు అనే లంకె నొక్కితే సరి. అదంతకదే ఈ టెంప్లేట్ వచ్చేస్తుంది మీ బ్లాగ్ కు.
    మళ్ళీ ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి