Loading...

28, అక్టోబర్ 2022, శుక్రవారం

ఏలనొ

 అత్యుత్సాహమ్మేలనొ

సత్యాన్వేషణ పథముల చన నేరకనే

నిత్యమ్మీ పరుగేలొకొ

ముత్యమువలెనే యరుదగు ముక్తిపదమనన్.

--లక్ష్మీదేవి 
కందము

18, అక్టోబర్ 2022, మంగళవారం

అందుకే

 రిమరి చేర్చికూర్చెదము మాటల ముత్యములెన్నియో, సదా

రిసరి వారలందు గల స్పర్థల గెల్వగ కాదదెప్పుడున్,
రిపరి రూపులందొదుగు ద్ధతిఁ బద్యములన్ని యొప్పుగా
జర సాగు నెన్నడపు ర్పము భంగినిఁ గూర్ప నేర్వగాన్.

దీపావళి

 చిరురూపమ్మున వెల్గు జ్యోతులవి పెంజీకట్లఁ బోఁద్రోలు, పూ

విరిమొగ్గల్వలెఁ దోచుచుందనరగా వీక్షింత్రు విభ్రాంతులై

వరుసందీపములెన్నియో నమరు నా వాకిళ్ళయందెల్లెడల్

మురిపెమ్మొప్పగ నింతులెల్లరును సమ్మోహమ్ముతోనుంచగా.


ఆర్భాటమ్ముగ ప్రేలు బాణముల నాయా యాటలంబండుగై,

నిర్భీతిన్, మదినిండు నుల్లసముతో, నిండారు పెన్వెల్గులా

విర్భావమ్మగు నింగి నేలలు మహావిభ్రాజమానమ్ములై

దుర్భావమ్ములఁ గూల్చు నిశ్చయముతో, తోషమ్మె దీపావళిన్.



లక్ష్మీదేవి.

మత్తేభ విక్రీడితము,

శార్దూలవిక్రీడితము



17, అక్టోబర్ 2022, సోమవారం

కలలో

 బిబిర తోటలో నడచి విచ్చిన పువ్వులఁ ద్రెంపి, తెచ్చి నే

రిపరి తీరులందమర, బాగుగ మాలల నల్లి, యేగుదున్
చర యాలయమ్మునకు క్కని నవ్వుల స్వామిఁ జూడగా,
రిమరి రమ్మటంచు నను క్కువ మీరగఁ బిల్చె స్వప్నమున్

14, అక్టోబర్ 2022, శుక్రవారం

అప్పట్లో

 రౌద్రాకారము ముందు నిల్చెననగా రౌక్ష్యంపుచిహ్నమ్ముతో,

క్షుద్రధ్వంసనమొక్క లక్ష్యమనగా క్షోభింపగాఁజేయుచున్,

ముద్రాంకమ్మగు రక్త గాధ, ధర నామూలంపుటుద్ఘోషమై,

భద్రాశ్వాసనమెల్ల నోడె నపుడా బాధించు రోగమ్ముతో.

పొంగారు

 ప్రాలేయాంశువు రాకతోసుఖముగా రాజిల్లు విశ్వమ్ము, నా

నీలాకాశముతోడ పృథ్వి భళిగా  నిండార వెల్గొందె, నే

లీలామాత్రపు గాలి సోకినదొ,  యీ  లేతాకులల్లాడెనే!

యీ లావణ్యములందు సోలు మది, తా,నింపైన రాగమ్ములో . 


--లక్ష్మీదేవి 

శార్దూలవిక్రీడితము 

8, అక్టోబర్ 2022, శనివారం

శ్రీకృష్ణం

 విశ్వేవ్యాప్తం యశోదాప్రియవరసుతరూపే సదాసుప్రసిద్ధం

నీలాభ్రాంగం మనోజ్ఞం నిరతరసనలీలే వినోదాంతరంగం॥

నానాలోకే ప్రజా ప్రాణభయహరణమానస్వరూపం ధరంతం

తత్త్వజ్ఞానాం విశేషార్థ పదభరిత గీతా ప్రదాతం ప్రణామః॥

--లక్ష్మీదేవి 
స్రగ్ధర. 

3, అక్టోబర్ 2022, సోమవారం

ఏదో

 భువిలో జీవించు జీవమ్ము బ్రదుకు భృతికై పోరు సల్పంగ తోడై,

లావణ్యంపు రూపా పలుకు కథలన్, నావగా నమ్ముకుంటిన్.
లేశమ్మైన, నన్, నీ లితమయిన లీలాకథాసారమియ్యీ
సంసారంపు సంరంముల మునుకలన్, వ్యమౌ రీతి గాచెన్.


-లక్ష్మీదేవి 
మహాస్రగ్ధరా 

1, అక్టోబర్ 2022, శనివారం

ధన్యాస్మి

 ముల్లోకములను కారుణ్యముఁగను మూకాంబ ప్రణతులమ్మా!

యుల్లమ్ము నిలిపి, బాల్యమ్ము మొదలు యూహించి కొలుచు నాలో, 

నుల్లాసమమర, దీవింప బ్రదుకు నుప్పొంగు కడలి కాగా, 

తల్లీల మురిసి పద్యానఁదలచి ధన్యాస్మి యనుచు నుందున్.


-- లక్ష్మీదేవి 

చిత్రత్వరితా. 



వరము

 చిరుచిరు నగవులనొలికెడు

మురిపెపు టెడదల కనుగొన ముదములు కలుగున్

నిరతము కలల జగము మనఁ

బరిపరి దొరకని యరుదగు వరమది భువిలో.

-లక్ష్మీదేవి 

సర్వలఘుకందము.

కనులనిలిచి..

 జగతిని మనియెడు జనులను మురిపెము

మిగులగ కనునట మినుకునయన

ముగమున వెలుగులు ముగియని కలుములు

పగలును నిసియును పసిడినయన

యుగముల కొలదిగ నొకపరి యొకపరి

కమితము నగుపరి కరుణనయన

నగవులఁ గురియుచు నటనలు సలుపుచు

వగపుల నణచును వరదనయన


సిరులు దొరలఁ గనును చెలువపు లయలను

తరళమొలుకఁ గనును దయిత యతని

మరులు కురియఁ గనును హరియెడ ప్రియముగ

కరమునొసగు నతని కనుల నిలిచి.


-లక్ష్మీదేవి

సర్వలఘుసీసము.