Loading...

29, ఆగస్టు 2011, సోమవారం

మా తెలుగు తల్లికి మల్లె పూదండ !


మా తెలుగు తల్లికి మల్లె పూదండ
మా కన్న తల్లికి మంగళారతులు
కడుపులో బంగారు కను చూపులో కరుణ
చిరునవ్వు లో సిరులు దొరలించు మా తల్లి

గల గలా గోదారి కదలి పోతుంటేను
బిర బిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలు దొరలు తాయి

అమరావతీ నగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలచి యుండే దాక

రుద్రమ్మ భుజ శక్తి
మల్లమ్మ పతిభక్తి
తిమ్మరుసు ధీయుక్తి కృష్ణరాయల కీర్తి
మా చెవుల రింగుమని మారు మ్రోగే దాక

నీ ఆటలే ఆడుతాం
నీ పాటలే పాడుతాం
జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ!
--------శంకరంబాడి సుందరాచారి.

తెలుగువారందరికీ తెలుగు భాషాదినోత్సవ శుభాకాంక్షలు !

2 కామెంట్‌లు:

  1. గల గలా గోదారి కదలి పోతుంటేను
    బిర బిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను
    బంగారు పంటలే పండుతాయి
    మురిపాల ముత్యాలు దొరలు తాయి

    ఆవును తెలంగాణా నుండి కృష్ణమ్మ గోదారి పొయి అంధ్రా లొ పంటలే పండుతాయి

    ఏమి రాసిండ్ర.....

    రిప్లయితొలగించండి
  2. ఇలాంటి ద్వేషం మనసులో నింపుకుంటే అన్నీ అలాగే అర్థమవుతాయండి. పల్లం వైపు నదులన్నీ పాఱి సముద్రంలో కలుస్తాయి. అందుకని సముద్రం మీద ద్వేషం చూపితే ఎలా?
    నాకు తెలుగువారంతా ఒక్కటే.
    మీరు ఆంధ్రా అని కోస్తా ప్రాంతాన్ని రాశారేమో మాది కోస్తా కాదు.

    రిప్లయితొలగించండి