Loading...

5, ఆగస్టు 2011, శుక్రవారం

నాగుల చవితి


శ్రావణమాసం శుద్ధ చవితి మేము నాగుల చవితి గా జరుపుకుంటాము. కొన్ని ప్రాంతాల్లో కార్తీకమాసంలో జరుపుకుంటారని తెలుసు.
నాగుల చవితికి మిగతా పండుగల్లాగా సున్నాలవీ పూయకూడదు.
ఇళ్ళల్లో కానీ, పొలాల్లో కానీ కన్నాలు ఉంటే పూడ్చకూడదు.
ఇల్లు తుడిచాక ముగ్గుపిండి తో ముగ్గు పెట్టకూడదు. సుద్దముక్కలు/చాక్ పీసులతో పెట్టాలి.
మొత్తానికి నాగులకు, ఏ కీటకానికీ ఏ హాని, పొరబాటుగానైనా, కనీసం ఆ వేళనైనా జరగకూడదు.
ఇదీ సంప్రదాయం. అన్ని గుమ్మాలకీ/తలుపులకీ ఆస్తీక అని వ్రాయాలి.
ఆస్తీకుడు ఎవరంటే--------------
అర్జునుని కొడుకు అభిమన్యుడు
అభిమన్యుడు యుద్ధంలో వీరమరణం పొందినప్పుడు అతని భార్య ఉత్తర గర్భవతి
అభిమన్యుని కొడుకు పరీక్షిత్తు
పరీక్షిత్తు కొడుకు జనమేజయుడు
అనాలోచితం గా చేసిన పాప ఫలితంగా, శాపఫలితంగా పరీక్షిత్తు పాము వలన మరణిస్తాడు
తండ్రి మరణానికి ఖేదం చెందిన జనమేజయుడు పాముజాతిని అంతటినీ మట్టుపెట్టే ఒక గొప్ప సర్పయాగాన్ని నిర్వహిస్తాడు.
యాగ మధ్యలో సర్పజాతిని రక్షించటానికి (వాతావరణ చక్రభ్రమణానికి అన్ని ప్రాణుల అవసరమూ ఉంది) వస్తాడు
తన మాటలచాతుర్యంతో జనమేజయున్ని ఒప్పించి సర్పయాగం ఆపి జగత్కల్యాణకారకుడౌతాడు ఆస్తీకుడు
అందుకే నాగులచవితి నాడు ప్రతి వాకిలి దగ్గరా ఆస్తీక అని రాసి సర్పజాతిని కాపాడినవాడిని అభినందనాపూర్వకంగా తలచుకొనడం జరుగుతుంది.

ఇక ఆనాడు అందరూ తలస్నానం చేసి నాగదేవతకు పాలు పోస్తారు. పల్లెల్లో అయితే పొలాల్లో పుట్టలు ఉంటాయి.అక్కడికే వెళ్ళి పాలు పోస్తారు. పూజలు చేస్తారు. ఆ అవకాశం లేకపోతే ఇంట్లో చిన్న విగ్రహం పెట్టుకుని, పాలు పోసి, పూజచేసి, నూల ఉంటలు, చలిమిడి నైవేద్యం పెడతారు. కొందరు రోజంతా ఉపవాసం ఉండి పూజిస్తారు.

నూల ఉంటలు ఎలా చేయాలో ఇక్కడ చూడండి. 

చలిమిడి - బియ్యప్పిండి లో మెత్తటి బెల్లపు పొడి కలిపి ఉండలు కడతారు. నూల ఉంట రుచి ముందు అదేం పనికి రాదు. అయినా ప్రసాదం కదా , తీసుకోవాలి. ఆరోగ్యానికి మంచిది కూడా.

ఇప్పుడు నూల ఉండలు చాలా ఇష్టం. పండుగ కాకపోయినా ఎప్పుడైనా చేస్తూ ఉంటాను.
నాగుల చవితి రోజు చెప్పుకోవాల్సిన కథ కూడా ఒకటుంది. అది ఇంకోరోజు రాస్తాను. :-)
                                                                          

6 కామెంట్‌లు:

  1. చిన్ని
    సారీ అండి . లింక్ ఇవ్వాలని మరిచిపోయాను. ఇపుడు ఇచ్చాను చూడండి పోస్ట్ లో.
    నూల ఉంటలు నల్లటి నలుపు ఉండలు. నల్ల నువ్వులతో చేస్తాం. అదే రంగు.
    ఇదే ఆ లింక్. -http://seemavanta.blogspot.com/2011/08/blog-post.html

    రిప్లయితొలగించండి
  2. మీ బ్లాగ్ చాల బావుంది. ఇక క్రమం తప్పక చదువుతాను.

    రిప్లయితొలగించండి
  3. మీ బ్లాగ్ ముందు మాలాంటి బ్లాగ్స్ దేనికి పనికి రావండి....

    రిప్లయితొలగించండి
  4. నందు,
    భలేవారే, మీకు మాటలు వచ్చినట్టు నాకు రావే........:-)
    ధన్యవాదాలండి.

    రిప్లయితొలగించండి