Loading...

15, ఫిబ్రవరి 2011, మంగళవారం

జయము నీకు తెలుగుతల్లి!

జయము నీకు తెలుగుతల్లి! జయము జయము జయము!
అక్షరాల ఆకులతో శోభిల్లే పూలవల్లి జయము జయము!

సొంత భాషనెఱుగకుండ
పెఱుగుతున్న యువతరాన్ని
కొత్తరకపు బానిసలని
దరిఁజేర్చి కాపాడవే
తేనెలూరు పలుకు తల్లి!


మన పాటల మన మాటల
మన పద్యపు భావాలను
తెలియలేని మా తరాన్ని
మెఱుగుపఱిచి తీర్చిదిద్ది
మమ్మేలవే కల్పవల్లి!
-లక్ష్మీదేవి

4 కామెంట్‌లు:

  1. చాలా బాగుందండి. లలిత గీతానికి చాలా చక్కగా సరిపోతుందేమో. మీకు పాడటం వస్తే ఓసారి వినిపిస్తే మేము వినడానికి సిద్ధం :)

    రిప్లయితొలగించండి
  2. ధన్యవాదాలండి.
    కూనిరాగాలు మాత్రం తెలిసిన నేను పాడటం సాహసమే అవుతుందిలెండి.
    రాసేటప్పుడు ఒక సరి అయిన బాణీ వస్తోందని కనీసం నాకు అనిపించేలా రాసుకుంటాను. కాకపోతే ఈ పాటలో అది కుదరలేదు అనిపిస్తోంది.

    రిప్లయితొలగించండి
  3. భావం చాలా బాగుందండి. చిన్న పిల్లలను కూర్చోబెట్టి నేర్పించాలనిపిస్తోంది.

    రిప్లయితొలగించండి
  4. ధన్యవాదాలండి. మీలాంటి ఉపాధ్యాయినీ గణం మీదనే రేపటి తరం మేధాశక్తిని పెంపొందించే మాతృభాషాధ్యయనం జరగాలని మాలాంటి వారి ఆశలు.

    రిప్లయితొలగించండి