Loading...

6, ఫిబ్రవరి 2011, ఆదివారం

కోటి మాటలు దొంగప్రచారాలకే!

బెంగళూరు రైల్వే స్టేషనులో నేను వేచి యుండగా ఒక చక్కటి అమ్మాయి వచ్చి నన్ను పలకరించింది.
హలో మేడం! మేము ఒక రీసెర్చ్ చేస్తున్నాము. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. చెపుతారా ? అంది.
మీకు ఇంటరెస్ట్ ఉంటేనే అనేమాట మాటిమాటికీ వాడుతూ మాట్లాడుతోంది.
సరే అన్నాను. మీరు రోజూ పేపర్లో ఏం చదువుతారు? మంచి వార్తలు /చెడు వార్తలు ఏవి ఎక్కువ ఉంటాయి?
అశాంతి ఎక్కువవుతోంది కదా? మానవ జీవితం శాంతిమయం కావాలంటే ఏం చెయ్యాలంటారు అంటూ అడుగుతూంది.
సరే, మాకూ బండికి ఇంకా బోలెడు సమయం ఉంది. చక్కటి మాటతీరు ని చూసి నేనూ ఇంప్రెస్ అయ్యి ఏదో నాకు తోచింది చెపుతూ వచ్చాను.
ఇక ఓ పుస్తకం తీసింది.చిన్నది. డైలీ స్ ఆదివారం ఎడిషన్ సైజులో ఉంది. వివాహవిచ్ఛేదన లను తగ్గించాలంటే ఏంచెయ్యాలి? మేం అమ్మటానికి రాలేదు మేడం. మీకు చదివే అలవాటు ఉంటే ఈ పుస్తకం తీసుకోండి. అంది. సరే తీసుకున్నాను. ధర చెప్పండి అన్నాను. అబ్బే ఇది ఫ్రీ మేడం. ఇందులో మా సైట్ అడ్రెస్ ఉంది. కావాలంటే కాంటాక్ట్ చేయండి, డొనేషన్ ఇస్తే తీసుకుంటాం. అంది. ఇంతలో ఒకతను కూడా వచ్చాడు.
సరే ఏదో సంఘసేవ కాబోలు అనుకున్నా. నాకు ఫోన్ రావటంతో వాళ్లూ వెళ్ళిపోయారు. నేనూ పుస్తకం నా పెట్టెలో వేసుకున్నాను. తర్వాత ఒక గంటయ్యాక తీసి చూద్దును కదా, ప్రతి వ్యాసంలోనూ వారి మత గ్రంథం పేరు!! దంపతులు గొడవలు రాకుండా ఉండాలంటే అందులో ఇలా వ్రాసి ఉంది, అలా వ్రాసి ఉందంటూ.
మతం మారమని చెప్పటం నేరమని అవేర్నెస్ బాగా పెరిగి హిందువుల్లొ వ్యతిరేకత వచ్చాక ఇలా మోసపుచ్చి బ్రైన్ వాష్ చేయటం మొదలుపెట్టారు. సున్నితమైన విషయాల్లో ఏ సలహా దొరుకుతుందేమోనని చూసేవారికి ఇలా ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తారేమో. నీవిది చదివితేనే నీకు పరిష్కారం దొరుకుతుంది అంటే విపరీతంగా టెన్షన్ లో ఉన్నవారు అటువైపు మళ్ళుతారు.
నాకు భలే కోపమొచ్చి ఆ పుస్తకం చింపి పడేసాను.
ఒక కుటుంబం లో యజమాని కి బాగా సుస్తీ చేసి ఇక బతకడన్న తరుణంలో వాళ్ళు మతం మారారని తెలిసింది. ఏమిటా ఎలా మారారు? ఆ దేవుడైతే కాపాడతాడని వాళ్ళకు ఎలా అనిపించింది అని క్లూ దొరకలేదు. ఇదిగో ఇలా మతం మాటే ఎత్తకుండా మెల్లగా బ్రైన్ లో దింపేయటానికి బాగా శిక్షణ ఇచ్చి పంపిస్తారేమో అనిపించింది. ఇప్పుడూ అతనికి సీరియస్ గనే ఉంది. ఏమిటో మరి ఈ బలహీన క్షణాలలో, బలహీన మనస్కులపై ఇలాంటి ప్రయోగాలు?

12 కామెంట్‌లు:

  1. ఈ విధంగా కూడా మత ప్రచారం చేస్తారన్న మాట.

    రిప్లయితొలగించండి
  2. అబ్బో! చాలానే ఉన్నాయి లెండి. విన్నవి చాలాఉన్నాయి. ఇది స్వంతంగా తెలుసుకున్నది.

    రిప్లయితొలగించండి
  3. మారడం ఎలాంటిదైనా అది వారి స్వంత నిర్ణయం.
    మార్చాలని ప్రయత్నించటం ఏవగింపు కలిగించే విషయం, సత్యగారూ!

    రిప్లయితొలగించండి
  4. నాయకులు పార్టీలు....బలహీనులు (మానసిక ) మతం మార్చుకోవడం వారి నైజమేమోనండీ :) :)

    రిప్లయితొలగించండి
  5. Matham maarithe vollu thagguthundani maa colleague matham maarindi. idi choosi emanaalo naaku ardham kaaledu!

    రిప్లయితొలగించండి
  6. ఇదెక్కడి ఘోరమండీ బాబూ! ఇంకా ఇలా ఏమార్చే వాళ్ళ దగ్గర మోసపోయే వాళ్ళు ఎంతమంది ఉంటారో కదా!

    రిప్లయితొలగించండి
  7. ఇలాంటి వాళ్ళని అసలు మనుషులుగ భావించకూడదు. మా నాన్న గారికి సీరియస్ గా ఉండి మేమంతా హాస్పిటల్ లో ఉంటే మా నాన్నకు తెలిసిన వ్యక్తి "మీనాన్న మీ దేవుడ్ని కొలుస్తున్నాడు కాబట్టి, అలా చావుబతుకుల్లో ఉన్నాడు. అదే మా దేవుడ్ని కొలిస్తే బాగుండేవాడు" అన్నాడు. నాకు చాలా కోపం వచ్చింది. కాని ఆ సమయంలో మానాన్న చావుబతుకుల్లో ఉండడం వల్ల నేను నిస్సహాయస్తితిలో ఉన్నాను.నాన్న చనిపోయారు అది వేరే సంగతి. మళ్ళీ అతను నాకు దొరికితే బాగా తిట్టాలి అనిపిస్తోంది. ఒకసారి అన్నవరం వెళ్తుండగా ఒకతను ట్రైన్ లో అందరికి వాళ్ళమతం గురించే చెప్తున్నాడు. నాదగ్గరకి వచ్చి నాకు కూడా చెప్తుంటే బాగా కోపం వచ్చి అతనికి బాగా క్లాస్ పీకాను. అంతే అక్కడినుండి ఇంకేమీ మాట్లాడకుండా కూర్చున్నాడు. మా కాలనీ లో కూడా పెద్ద పెద్ద మైకులు పెట్టి కేకలు పెడుతుంటారు. నేను మూజిక్ ప్లేయర్ ఆన్ చేసి ఫుల్ సౌండ్ పెడ్తాను.

    రిప్లయితొలగించండి
  8. శ్రేయోభిలాషి గారు, మీ మనసులో మాటని పంచుకున్నందుకు ధన్యవాదాలు.
    వాళ్ళు పెద్ద పెద్ద మైకుల్లో తెలిసీ తెలియకుండా మన పద్ధతులను, విధానాలను, దేవుళ్ళని ఇష్టం వచ్చినట్టు విమర్శిస్తూ ఉంటారు. కానీ మనమేం చేయలేం.

    రిప్లయితొలగించండి
  9. ఇంతకూ "మతం" అంటే ఏమిటండీ...!!!

    రిప్లయితొలగించండి
  10. వికీ గారూ,
    మీరు తెలుసుకోవాలని అడిగారని నేననుకోను.

    అయినా నాకు అర్థమయింది చెప్తాను. మతం అంటే అభిప్రాయం అని అర్థం.
    కానీ కొన్ని పదాలని మనం కొన్నిటికి పరిమితం చేస్తాం. ఏ భాషలో అయినా అంతే.
    { ఉదా: ఆంగ్లములో స్కూల్ అనే పదానికి ఉండే అర్థం ఏమిటి ? దాన్ని మనం పదవ తరగతి వరకూ ఉండే బడికి మాత్రమే పరిమితం చేశాం. ఇప్పుడిప్పుడే బిజినెస్ స్కూల్ లాంటివి జనబాహుళ్యం వింటున్నారు.}

    అలాగే మతం అనే పదాన్ని "మనుష్యధర్మం అనే విషయంపైన అభిప్రాయం"గా మనం వాడుతున్నాం.
    లోకాస్సమస్తా స్సుఖినో భవంతు అనేది నా మతం చెప్పిన గొప్ప విషయం అని చెప్పుకునేందుకు గర్విస్తున్నాను.

    రిప్లయితొలగించండి