Loading...

17, ఆగస్టు 2010, మంగళవారం

జగజ్జనని - 4

జగజ్జనని - 4

మృదు మందహాసమున జనని కరుణను తలపించు శీతలమ్ము!
కుదుట పడజేయు రొదలు నిండిన మానసమ్ము
వెదుకగానెచట దొరకబోదని, ఒకవంతు సరిపోలు అనుభవమ్ము
నెదుట కురిపించి చూపించు నెలబాలు చల్లదనమ్ము!
-లక్ష్మీదేవి.

అమ్మ వారి మృదువైన మందహాసము ఎంత చల్లనిదంటే రొదలు, సొదలు నిండిన మనసును కుదుటపడేలా చేస్తుంది.  అందులో ఒకవంతును చూపుతున్నట్టుగా వెన్నెలగా కురిపించి వెన్నెలలోకి రాగానే మనసును కొంత ఆహ్లాదపరుస్తుండడమే దానికి నిదర్శనము కాదా. ఔను.

8 కామెంట్‌లు:

  1. మందాకిని గారికి నమస్సులు ...!
    ముందుగా మీకు వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు.
    మీకు మా గ్రామ సందర్శనకై సాదర పూర్వక ఆహ్వానము.
    మీ అభినందనకు దన్యవాదములు.
    www.mogilipet.blogspot.com

    రిప్లయితొలగించండి
  2. Thank you madam. "Mandaakini". one who read the novel "Anando Brahmma" by yendamoori, Never forgets that name for a life time. He wrote in that book, Mandaakini means "Nemmadigaa Pravahinchu Nadhi". Mee blog kuda mee peruki taggattu gaaney undhi. I am following it. Keep posting.

    రిప్లయితొలగించండి
  3. కృతఙ్ఞతలు కిషన్ గారూ!
    అంతే కాదు, అసలు మొదట మందాకిని అంటే ఆకాశగంగ అని అర్థం అని మీకు తెలుసనుకుంటాను.

    రిప్లయితొలగించండి
  4. అమ్మ వారి మందహాసం మీద మీ కవితచాలా బాగుంది, 'మందాకిని' గారు!

    రిప్లయితొలగించండి
  5. dr గారు, అన్ని పోస్ట్ ల మీద మీ వ్యాఖ్యలు ఉత్సాహం పెంచుతున్నాయి. చాలా సంతోషం.

    రిప్లయితొలగించండి