Loading...

2, జూన్ 2010, బుధవారం

జగజ్జనని

జగజ్జనని

ప్రసూనమ్మువంటి పల్లవాధర
దరహాస ధవళకాంతిని పోల
అరుణ రంజితమైన ఆకసాన
బాలార్క కిరణ రేఖలమిరె బాగు బాగు

బంగారు ముఖ చందమినుమడించునట్టు
కురుల నీలిమ దాగిన యటుల
భానుడుదయించు ప్రభాత వేళ
కటిక చీకట్లు వెనుదిరిగి సాగు.
-లక్ష్మీదేవి

**********

ఇది అమ్మవారి చిరునవ్వుని వర్ణించాలని చేసిన చిన్ని ప్రయత్నము.
అనుక్షణం అన్నింటిలో దర్శనమిచ్చే అమ్మవారిని గురించి వ్రాయాలని...

పూవు వంటి మెత్తని, లేత చిగుళ్ళవంటి లేత ఎర్రటి పెదవులపై విరిసిన చిరునవ్వుల కాంతిలా,
ఎరుపు రంగు సంతరించుకున్న ఆకాశంలో ఉదయించే సూర్యుని తెల్లటి కిరణాలు కనిపిస్తున్నాయి.

ఇది అమ్మవారి ముఖ సౌందర్యాన్ని గురించి:

బంగారు కాంతులతో వెలిగిపోయే ముఖారవిందంలోని కాంతి రెట్టింపయ్యేట్టు గా ఎక్కడెక్కడ ఉన్న నీలిమ(నలుపు)అంతా కురుల్లో దాగినట్టు,
రవి ఉదయించే తొలిసంజెల్లో చీకట్లు వెనుదిరుగుతున్నాయిట.

4 కామెంట్‌లు:

  1. అమ్మ వారి మీద కూడా కవితలు రాసేస్తున్నారు. చాలా బాగుంది. నాకు ఎప్పటికబ్బేనో ఈ భాగ్యం. కూసింత అరువిద్దురూ.. :)

    రిప్లయితొలగించండి
  2. భలేవారే! మీరు వేదం మూవీ గూర్చి సరదాగా రాసినట్టు నేను రాయగలనా ఏమిటి!

    రిప్లయితొలగించండి
  3. మీ కవితలు చాలా లలితంగా, సౌమ్యంగా ఉన్నాయండి. ఇలాంటి కవితలంటే నాకు ఇష్టం. మీ ప్రయత్నాన్ని తప్పకుండా కొనసాగించండి!

    రిప్లయితొలగించండి