Loading...

23, మార్చి 2010, మంగళవారం

జగదభిరాముడు శ్రీరాముడే !

జగదభిరాముడు శ్రీరాముడే !!
ఇన్నాళ్ళయినా ఇన్ని సార్లు రామాయణం చదివినా, ఏదో తన్మయత్వం కలుగక మానదు. చిన్నప్పుడు మా పిన్ని (చిన్నాన్న భార్య ) మాకందరికీ ముద్దలు పెడుతూ ఎన్నిసార్లు రామాయణం చెప్పి ఉంటుందో! అయినా మళ్ళీ చెప్పమని అడిగి చెప్పించుకునే వాళ్ళం.
బాల రామాయణం చూసినప్పుడు ఆ పిల్లల శ్రద్ధకు ముచ్చటేసింది. గుణ శేఖర్ గారు దర్శకత్వం వహించారు. పిల్లలతో చాలా అవస్థలు పడినట్టు చెప్పారని ఎక్కడో చదివిన గుర్తు. అయినా పెద్దలతో అవస్థలు పడాల్సి వస్తున్న కాలంలో ఇది పెద్ద విషయం కాదు.
ధనువు ఘనమిది; ఘనులలో ఘనులు కూడ
పట్టి కదలించరానిది; యెట్టి దిట్ట
యైన దీనిని నెక్కిడ నలవి కాని
వా(డె యగుచుండె; ఇది స్వానుభవము విను(డు.

యఙ్ఞ తలమును పదను జేయంగ( దల(చి
యల్ల నొకనా(డు నా(గలి నంది దున్ను
చుండ, భూగర్భమున దా(గి యుండు నొక్క
పసిది చేపడె నానోము పంట యన(గ.

అదియె నా బిడ్డగా ముద్దులార( బెంచ(
బెరిగి, యౌవనవతి యయి ప్రీతి గూర్చు
చుండె మా ఇంటి వెలు(గౌచు, నిండు గుణము
గలిగి వర్తించు తెలివి తేటలను మించి.

పలుచటి బెల్లపు పానకం గొంతులోంచి జారినట్టుగా తియ్యగా అనిపించింది సుందర రామాయణంలోని ఈ పద్యాలు చదువుతూంటే. మరి మీకో....?

7 కామెంట్‌లు:

  1. శ్రీరామ నీనామ మెంత రుచిరా ?!!!!!!

    రిప్లయితొలగించండి
  2. శ్రీ రామ నవమి శుభాకాంక్షలు !

    రిప్లయితొలగించండి
  3. సీతా స్వయం వర ఘట్టం లోని ఈ పద్యాలు చాలా బాగున్నాయి. మరీ 3 మాత్రమే రాశారే.? శివ ధనుర్భంగము, జానకీ పరిణయము కూడా రాసేస్తే బాగుండేది కదా :)

    రిప్లయితొలగించండి
  4. శంకరంబాడి సుందరాచారి గారు రాసిన సుందర రామాయణం లోని ఈ పద్యాలు నిఘంటువు సహాయం అవసరం లేకుండా నా లాంటి పామరులకు ఎంతో ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంటే నేనొక్కదాన్నే ఆస్వాదించడం తప్పని తెలియని వారికి పరిచయం చేద్దామని ఆ ౩ పద్యాలూ నా టపాలో పెట్టానండీ! పుస్తకపరిచయ వ్యాసం చక్కగా వ్రాసే నేర్పు నాకు లేదనే సందేహంతో క్లుప్తంగా ముగించాను.
    మీకు నచ్చాయి సంతోషం!

    రిప్లయితొలగించండి