Loading...

12, నవంబర్ 2009, గురువారం

"ఎనిమిది"

ఇవాళ ఈ ’అష్ట’సంఖ్యకు సంబంధించి ఎప్పుడో సేకరించి పెట్టుకున్న వివరాలు:

అష్ట దిక్కులు - తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం
ఈశాన్యం, వాయువ్యం, నైఋతి, ఆగ్నేయం

అష్ట దిక్పాలకులు - ఇంద్రుడు, అగ్ని,యముడు, నిర్వతి,
వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు
(ఏ దిక్కుకు ఎవరో సరిగ్గా తెలీదు.)

అష్ట దిగ్గజాలు - అల్లసాని పెద్దన, నంది తిమ్మన, అయ్యలరాజు రామభద్రుడు,
ధూర్జటి, తెనాలి రామకృష్ణుడు, మాదయగారి మల్లన,
పింగళి సూరన, భట్టుమూర్తి.

అష్ట మహిషులు- రుక్మిణి, సత్యభామ, జాంబవతి, మిత్రవింద,
భద్ర, సుదంత, కాళింది, లక్షణ.

అష్ట లక్ష్ములు - ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి,
సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి.

అష్ట ఐశ్వర్యాలు- దాసీజనం, భృత్యులు, పుత్రులు, మిత్రులు,
బంధువులు, వాహనాలు, ధనం, ధాన్యం

అష్టావధానం - వర్ణన, సమస్యాపూరణం, వ్యస్తాక్షరి, నిషిద్ధాక్షరి,
పూరణం, అప్రస్తుత ప్రసంగం, ఘంటాగణనం, చదరంగం

ఇక అష్టకష్టాల గురించి, అష్టావక్రుల వారి గురించి ఇప్పుడు వద్దని మానుకున్నాను.
ఏదో నా లాంటి పామరులు తెలుసుకుంటారని రాశాను. ఎవరికీ తెలీదని కాదు.

11 కామెంట్‌లు:

  1. ఇంద్రుడు తూర్పుకు,అగ్ని ఆగ్నేయానికి,యముడు దక్షిణానికి,నిరుతి నైరుతికి,వరుణుడు పడమరకు,వాయువు వాయవ్యానికి,కుబేరుడు ఉత్తరానికి,ఈశానుడు ఈశాన్యానికి

    రిప్లయితొలగించండి
  2. బావుందండీ టపా ! అందరికీ అన్నీ తెలియవుకదా !తెలియనివారు తెలుసుకుంటారు .చివరిరెండూ కూడా పూర్తి చేసెయ్యాల్సింది .

    రిప్లయితొలగించండి
  3. మంచి సమాచారం! నాకైతే వీటిలో సగం తెలీవు :(
    ముఖ్యంగా అష్టైశ్వర్యాలు ఎంత తరచుగా వాడే పదం, అయినా అసలవేంటో ఇప్పుడే తెల్సింది! థాంక్యూ :-)

    రిప్లయితొలగించండి
  4. తూర్పు-ఇందృడు, ఆగ్నేయం-అగ్ని, దక్షిణం- యముడు, నైఋతి-నిరుఋతి, పశ్చిమం-వరుణుడు, వాయవ్యం- వాయువు, ఉత్తరం- కుబేరుడు, ఈశాన్యం- ఈశానుడు అనుకుంటా... :)

    ఇంకా అష్ట వసువులు కూడా ఉన్నారు. వారి పేర్లు తెలియదు.

    రిప్లయితొలగించండి
  5. విజయమోహన్ గారూ! ధన్యవాదాలు. అగ్ని, యముడు, ఈశానుడు, వాయువు గురించి తెలుసు. మిగిలినవి ఇప్పుడు తెలుసుకున్నాను.

    రిప్లయితొలగించండి
  6. పరిమళ గారూ! ధన్యవాదాలు. కష్టాలెందుకులెండి.

    రిప్లయితొలగించండి
  7. నిషిగంధ గారూ! పేరు బావుందండీ!
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  8. విశ్వప్రేమికుడు గారూ!
    సమాచారానికి ధన్యవాదాలు. అష్ట వసువుల గురించి తెలుసుకుందాం.

    రిప్లయితొలగించండి
  9. అష్టదిక్కులు, అష్టదిక్పాలకులు, అష్టైశ్వర్యాలు మో|| అయినవి ఒక్క చోట కనబడటం నచ్చింది అండి. ఇంకో రెండు అష్టలు చెప్తాను వినండి:
    అష్టసిద్ధులు: అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశత్వము, వశిత్వము
    అష్టమదములు: అన్నమదము, అర్థమదము, స్త్రీమదము, విద్యామదము, కులమదము, రూపమదము, ఉద్యోగమదము, యౌవనమదము
    అష్టస్వామ్యములు: విక్రయ, దాన, వినిమయ, జల, తరు, పాషాణ, విధి, నిక్షేపములు
    అష్టాంగములు: యమము, నియమము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధ్యానము, ధారణ, మననము, సమాధి
    అష్టభోగములు: ఇల్లు పరుపు వస్త్రము అభరణము స్త్రీలు పుష్పము గంధము తాంబూలము
    అష్టనగములు: వాసుకి, అనంతుడు, తక్షకుడు, శంఖపాలుడు, కుళికుడు, పద్ముడు, మహాపద్ముడు, కార్కోటకుడు
    అష్టభాగ్యములు: రాజ్యము భండారము సేన్యము ఏనుగులు గుర్రములు ఛత్రము చామరము ఆందోళిక
    అష్టకష్టములు: దేశాంతర గమనము, భార్యావియోగము, కష్టకాలములో ప్రియబంధుదర్శనము,ఎంగిలితినడము, తన శత్రువులతో స్నేహము చేయడము, పరాన్నమునకు కాచియుండడము, సభలోఅప్రతిష్ట వచ్చుట, దరిద్రమనుభవించడము

    ఐతే ఇప్పట్లో "దేశాంతరగమనం" ఒక కష్టం గా కాక బహు-ఇష్టంగా భావిస్తున్నారు అనుకోండి జనాలు. ఎంగిలి తినడం ఒక ఫేషన్, అమెరికా లో "ఫ్రీ ఫుడ్" అని పరన్నానికి కాచియున్డటం ఒక అలవాటు. ఉద్యోగాల పేరు చెప్పి, ఆన్సైట్ పేరు చెప్పి భార్యాభర్తలు వేరుగా ఉండి ఫోటోలు దిగి పంపుకోవడం ఒక విశేషం. ఇప్పుడు వెరైటీ కష్టం ఏమిటి అంటే, మనకు సుఖదుఖాలలో ఏది వచ్చిన బంధుజనం రాకపోవడమే.

    రిప్లయితొలగించండి
  10. సందీప్ గారూ! చాలా విషయాలు చెప్పారండీ. అష్ట సిద్ధులు, అష్టాంగయోగాలూ విన్నాను కానీ, ఇంకా వినాల్సినవి ఉన్నాయన్నమాట. మీ ఆవేశం ఈనాటి పిల్లలకు కూడా రావాలని ఆశిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  11. అష్టవిధ శృంగార నేయికలు కూడా ఉన్నారండోయ్ :

    రిప్లయితొలగించండి