Loading...

17, జూన్ 2009, బుధవారం

మంచి మాటలు

విత్తంబు విద్య కులము
న్మత్తులకు మదంబొసగు మాన్యులకున్ స
ద్వృత్తినొసంగున్ వీనిం
జిత్తంబున నిడి మెలంగ జెలువు కుమారా!

కుమారా!
ధనము, విద్య, ఉన్నతకులము మదించిన వారికి గర్వము పెంచును.
మాన్యులకు మంచి స్వభావమును వృద్ధి చేయును.
ఈ విషయమును మనసులో ఉంచుకుని మెలగుట మంచిది.

పక్కి అప్పల నరసయ్య గారు రచించిన కుమార శతకములోనిది ఈ పద్యము.

విద్వాన్ దండిపల్లి వేంకత సుబ్బా శాస్త్రి గారు వ్యాఖ్యానం రాశారు.

4 కామెంట్‌లు:

  1. మంచి పద్యాల్ని అప్పుడప్పుడూ గుర్తు చేసుకుందామనే...
    ధన్యవాదాలు శివ గారూ!

    రిప్లయితొలగించండి
  2. శివ గారూ, మంచి పద్యం వెలుగులోకి తెచ్చారు. ధన్యవాదాలు.
    ఏకం సత్ విప్రా బహుదా వదంతి. -- ఒకే విషయాన్ని పండితులు చాల రకాలుగా (చాలా ఉదాహరణలతో) చెప్పారు. నిజానికి మనిషి మానవత్వంతో బ్రతకాలంటే అవసరమైనవి, తెలుకోవాల్సినవీ కొన్నే. అందులో ఇది ఒకటి. గర్వం బలసినపుడు మానవత్వం క్షీణిస్తుంది.
    మీనుంచి మరిన్ని మంచి విషయాలు ఆసిస్తూ..

    రిప్లయితొలగించండి
  3. ఇదేం అన్యాయమండీ బాబూ!
    ఈ పద్యాన్ని గుర్తు చేసుకుని మిత్రులందరికీ గుర్తు చేసింది నేనైతే శివ గారికి ధన్యవాదాలు చెప్పారు?
    శివ గారు వ్యాఖ్య చూసి పొరబడ్డారు పునర్వసు గారూ!
    ఏదైమైనా ధన్యవాదాలండీ!

    రిప్లయితొలగించండి