Loading...

22, జనవరి 2009, గురువారం

వ్రతమూ-మనమూ

మససులో మాట సుజాత గారు రాసిన వ్రతము గురించి టపా చదివాక వ్యాఖ్య రాయబోతే అదే పెద్ద టపా అయింది. అందుకే నా బ్లాగులోనే రాస్తున్నాను.

చాలామంది వ్రతాల అనుభవాలు ఇలాగే ఉంటున్నప్పుడు మనం కొత్తగా ఒక ప్రయోగం చేద్దామనిపిస్తుంది. ఏంటంటే పూజ అంతా అయ్యాక కథలు మనం తలా ఒక కథ చెప్తే ఏం? ఎలాగు అన్ని కథలు మనకు తెలిసినవే కదా! పిల్లలకు తెలిస్తే వాళ్లు చెపితే ఇంకా బాగుంటుంది కదా!

మనమూ వ్యావహారిక భాషలో చెప్పడం వల్ల అందరికి చక్కగా అర్థం కూడా అవుతుంది. ఏమంటారు? ఎందుకంటే రుద్రాభిషేకాలు, మిగిలిన పూజల కన్నా ఈ సత్యనారాయణ వ్రతం ఎంతో సులభంగా చేసుకోగలిగేది. ఎంతో గొప్పదైన ఈ వ్రతము చేసుకున్నప్పుడు మనస్సు కూడా ఎంతో ప్రశాంతంగా అవుతుంది. ఇలాంటి గోప్పవ్రతమును ఇలాంటి చిన్న కారణాలవల్ల మనమూ ఆసక్తి ని కోల్పోకూడదని నా ప్రయత్నం.

ఒకవేళ పిల్లలు కథ పూర్తి గా చెప్పలేని పక్షంలో కథ మనం చెబుతూ వాళ్ళని చిన్న చిన్న ప్రశ్నలు వేయవచ్చును.
లేదా కథలో పాత్రల పేర్లు అడుగుతూ కథని కొంచెం ఆసక్తి కరంగా చేయవచ్చును. ఎప్పుడైనా అందరు కలిసి చేసినప్పుడే ఎ పనైనా విసుగు రాకుండా ఉంటుంది.

ఇంకో విషయం ఏమిటంటే మనముఎవరింటికైనా వెళితే వాళ్లు ఆహారపానీయాలు అందించి సంతోషిస్తారు. మనము వద్దంటే ఎంతో బాధ పడతారు. మనము కూడా వాళ్ళను బాధపెట్టకూడదని కొంచెం ఆలస్యమవుతుందని తెలిసినా వేచివుండి వారి ఆతిథ్యము తీసుకుని మరీ వస్తాము.( బహుశా ఈ పరిస్థితి ఏదో ఒకరోజు అందరికి ఎదురయ్యే ). అలాగే

మనము దేవుని ముంగిటిలో కెళ్ళి ప్రసాదం ఆలస్యమవుతుందనుకుంటే ఎట్లా?
ఏదో నాకు తోచింది రాశాను తప్పులుంటే విజ్ఞులు దిద్దగలరని ఆశిస్తాను.

4 కామెంట్‌లు:

  1. ఏంటంటే పూజ అంతా అయ్యాక కథలు మనం తలా ఒక కథ చెప్తే ఏం?... NO NO అలా మనంతట మనమే చెప్పకూడదు. పంతులు గారే చెప్పాలి. శంకంలో పోస్తేనే తీర్థం. అన్ని పూజలు మనమే చేసుకొని, అన్ని కథలు మనమే చెప్పుకుంట్ పంతుల్లందరూ ఏమవ్వాలి??

    రిప్లయితొలగించండి
  2. అయ్యో, మాస్టారూ!
    పూజ పంతులు గారితో చేయించి, దక్షిణ సమర్పించుకుంటాం కదండీ!
    నేను మనమే చెప్పుకుందాం అన్నది కథలు మాత్రమేగా!

    రిప్లయితొలగించండి
  3. మీ భక్తి భావనా వాహిని బాగుంది. పూజలమీద ఆశక్తిని కోల్పోకూడదన్న మీ అభిప్రాయమూ బాగుంది. మీరన్నట్టు పూజలూ వ్రతాల్లో ఆశక్తిని పెంచుకోవటానికి ప్రయత్నించాలి. మన తరువాతి తరాల వరకూ కొనసాగాలంటే కొత్త పద్ద తులు పాఠించాల్సిన అవసరం చాలా ఉంది.

    రిప్లయితొలగించండి
  4. ధన్యవాదాలు.ఆ దిశ గా అందరం కలిసి ప్రయత్నిద్దాం.

    రిప్లయితొలగించండి