Loading...

19, మార్చి 2021, శుక్రవారం

అందలమెక్కిస్తే ....

 

అందలమెక్కిస్తే అమ్ముకుతినడం మొదలెట్టారేంటో! ఒకరు ప్రభుత్వ రంగసంస్థలు, ఒకరు ప్రభుత్వ భూములు, ఒకరు దేవాలయ భూములు వరుస పెట్టేశారు. మొదటి రెండూ ప్రభుత్వానికి చెందినవి. ఒకటి నడపలేక, ఒకటి ఆదాయం లేక అమ్ముకుంటున్నారు సరే.
దేవాలయ భూములు అమ్మడానికి ప్రభుత్వానికి హక్కు ఎలా ఉంటుంది? చట్ట ప్రకారం ఉంటుందని తెలుసు. ఉండకూడదు కదా అన్నది ధర్మసందేహం. వీటికి సమాధానాలుగా చెప్పే కాకమ్మ కబుర్లకు దీటైన పిట్టమ్మ కబుర్లు చెప్పడానికి బోలెడు మంది ఉంటారు.
కాబట్టి ఇవన్నీ కాదు, జరుగుతున్నదిదైతే దీని పరిణామాల కోణం ఇంకోటుంది.గుడికి ఇన్ని వేల ఎకరాలు అవసరమా అన్నది వేరే చర్చ.
-
ఇక్కడే రెండు వార్తలున్నాయి. గుడి భూముల అమ్మకం గురించి ఒక వార్త. దాన్ని ఖండిస్తూ ఒక వార్త. ఏది నిజమో జగన్నాథుడు చెప్పాల్సిందే, మానవుల వల్ల కాదు.
అమ్మిన తరువాత కొన్నవారి ద్వారా ఆ భూముల్లో జరిగేది రియల్ ఎస్టేట్ వ్యాపారమే. దాని రూపాలు పలు విధాలుగా ఉండొచ్చు. సామాజిక, ఆర్థిక, భౌగోళిక, పర్యావరణ కాలుష్యాన్ని పెంచడమే ఆఖరుకు జరుగుతుంది.

అడవులను పెంచడం మనవల్ల కానిపని. ఖాళీ భూములను ఏమీ చేయకుండా ఉంచినా పర్యావరణానికి ద్రోహం చేయకుండా ఉన్నట్టే. ప్రైవేట్, ప్రభుత్వ భూములు వేటినీ రియల్ ఎస్టేట్ భూతం వదలదు. కనీసం గుడి పేరునున్నవైనా వదిలేయొచ్చు కదా!!

-

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి