Loading...

24, ఫిబ్రవరి 2021, బుధవారం

మేలుకొలుపు వంటి జోలపాట

 

జోలపాట
--న్యాయపతి పార్థసారథి
-------------
జో ఆంధ్రపుత్రుడా, జో తెలుగువాడా..
నిద్రపో నాయనా నీకు తెలివేలా.... జో,జో
నీ వంశవృక్షమ్ము నీడలో పెరిగీ
పైవారు మన్ననకు పాత్రులైనారూ
నీకేలరా చింత ఈ కాలమందూ
పరుపుపై చక్కగా పవళించవోయీ ... జో,జో
అన్ని దేశములందు ఆంధ్రులంటేనూ
చిన్న చూపే చూసి శివమెత్తుతారూ
భావాలు మనకేల ప్రగతి మనకేలా
నీ కళ్లు మూసుకొని నిద్రపో చాలా..... జో,జో
ఇరుగుపొరుగుల వారు ఇట్టె లేచారు
తమ జాతి సంస్కృతి దిశల చాటారూ
తెలుగువాడివి నువ్వు వెలుగు నీకేలా
నిద్రపో హాయిగా ముద్ర వేసుకొని... జో,జో
ఏ పూర్వ పుణ్యమో ఈనాడు నేనూ
జోలపాటలు పాడి జోకొట్టినానూ
నా తెలుగు సోదరా నిద్రపోవోయీ
ఊపేను మెల్లగా తూగుటుయ్యాలా.... జో,జో
(ప్రచురణ: క్రాంతి లిఖిత మాస పత్రిక, అక్టోబర్‌ 1954)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి