Loading...

30, జనవరి 2021, శనివారం

కాదనువారెవరూ....?!


 

ఆత్మా???

 

ఆత్మతో పనేముంది?
రేతో వటకణీకాయాం ఘృత పాకాది వాసనం జాతిస్మృతిరయస్కాంతః సూర్యకాంతోంబు భక్షణం
- మహాభారతం, భీష్మ : 218-29
మానవ రేతస్సు నుండే శరీరంతోపాటు దాని చైతన్యమూ, బుద్ధి, మనసు వస్తాయి. సూర్య కాంతశిల నిప్పును పుట్టించినట్లు ఆయస్కాంతం ఇనుమును ఆకర్షించినట్లు, మనసే శరీర కార్యాలను నియంత్రిస్తుంది. ఇక ఆత్మతో పనేముంది?

23, జనవరి 2021, శనివారం

hmmmm.....

 ఫోటో వివరణ అందుబాటులో లేదు.

21, జనవరి 2021, గురువారం

మాయావీ!

 

కొరతేమి లేదు మాయావి కృష్ణా కొరతేమి లేదూ కృష్ణా కొరతేమి లేదూ గోవిందా
కొరతేమి లేదు మాయావి కృష్ణా కొరతేమి లేదు కృష్ణా కొరతేమి లేదూ గోవిందా
కంటికి కనరాక నిలుచున్న కృష్ణా కంటికి కనరాక నిలుచున్ననేమి కొరతేమి లేదు మాయావి కృష్ణా
వేడినంత వరమిడ వేంకటేశుడుండంగా వేడుటకునేముంది మాయావి కృష్ణా శ్రీకృష్ణా నరసింహా గోవిందా గోవిందా
తెరవెనుక నిలుచున్న కృష్ణా కృష్ణా తెరవెనుక నిలుచున్న కృష్ణా నిను నరయంగ జ్ఞానులకె సాధ్యమూ కృష్ణా
తెరవెనుక నిలుచున్న కృష్ణా నిన్ను నరయంగ జ్ఞానులకె సాధ్యమూ కృష్ణా
అయితేమి కొరతేది నాకింక కృష్ణా
అయితేమి కొరతెది నాకింక కృష్ణా
కొండపై రాయిగా నిలుచున్న వరదా,
కొండపై రాయిగా నిలుచున్న వరదా
కొరతేమి లేదు మాయావి కృష్ణా
కొరతేమి లేదు మాయావి కృష్ణా శ్రీకృష్ణా నరసింహా గోవిందా గోవిందా
కలియుగమునందు శిలలో నిలచి స్థిరమయ్యి కోవెల నిలుచున్న కేశవా
కలియుగమునందు శిలలో నిలచి స్థిరమయ్యి కోవెల నిలుచున్న కేశవా
కొరతేమి లేదు మాయావి కృష్ణా
కొరతేమి లేదు మాయావి కృష్ణా
ఏదీ లేదనని శ్రీకృష్ణా ఏదీ లేదనని శ్రీ కృష్ణా
నీ ఎదను సంపదలొసగేటి దయగల నాతల్లి
ఎప్పుడూ కొలువుండ ఏమి కొఱ నాకు
ఎప్పుడూ కొలువుండ ఏమి కొఱ నాకు
ఒక్క కొఱ లేదు మాయావి కృష్ణా
ఒక్క కొఱ లేదు మాయావి కృష్ణా శ్రీకృష్ణా నరసింహా గోవిందా గోవిందా
 
 
తమిళ ప్రసిద్ధ కీర్తన కు నా తెలుగు అనువాదం  
 
--లక్ష్మీదేవి.

14, జనవరి 2021, గురువారం

కృష్ణా..

కృష్ణా నీ బేగనె బారో అన్న పల్లవితో మొదలయ్యే వ్యాసరాయర కీర్తన  చాలా ప్రసిద్ధము. వేర్వేరు రాగాలలో పాడుతుంటారు. సంగీతజ్ఞులే కాక ఇతర జనులు కూడా వారి వారి మనోధర్మానుసారము వేరు రాగాలలో పాడడం విన్నాను. 

నాకు తెలిసినంతలో దానిని తెలుగులో పాడడానికి వీలుగా వ్రాద్దామనిపించింది.

ఇప్పటికే ఎందరో అనువదించి ఉంటారు. 

అన్ని అనువాదాలలో నాదొక అనువాదము

పాడి చూసుకొనగలరు.

😊😊😊

--


కృష్ణా నీవీనాడే రారా!!

కృష్ణా వేవేగమే రారా!!

వేగమె రారా దరిసెనమీరా!!


కాలి అందెలు మ్రోగ నీలాల కడియాల

నీలవర్ణుడ రారా నాట్యమాడగా రారా!


నడుమున మొలతాడు కేలిని యుంగరము

మెడలోన సింగార వైజయంతిమాలా!!


కాశీపీతాంబరము కరమందు వేణువు

మేనెల్ల అలదిన సిరిచందనమ్మూ


అన్నిలోకాలను అంగిట చూపేటి

జగదోద్ధారకుడైనా జగన్నాథ కృష్ణా!!


---లక్ష్మీదేవి.

--------------------------------------------

గమనిక - నా అనువాదం లోని చివరి చరణం యథానువాదమైతే నిజానికి - ' అమ్మకు లోకమ్మునంగిట చూపిన' అని రావాలి. జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్. :) 

నాకు ఇలాగే వ్రాసుకోవాలనిపించింది కాబట్టి అన్ని లోకాలను అంగిట చూపడం గురించి వ్రాసుకున్నాను. 

😊😊