Loading...

21, సెప్టెంబర్ 2018, శుక్రవారం

ఎటు పోతున్నాం?

.
ఈ రెండు మూడు రోజులు నిమజ్జనం, ట్రాఫిక్ జామ్ తో ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి. ఈ పదిరోజులూ పనికిమాలినవీ భరించలేక అవాయిడ్ చేసిన పాటలన్నీ గణేశుడి పేర్లతో కలుపుకొని మైకులలో వినక తప్పదు. లడ్డూల వేలం వేయడాలు చిన్న ఊళ్ళకు కూడా పాకింది. డెబ్భై వేలు ఎనభైవేలు పలుకుతుంది. అక్కడ వాడిన హారతిపళ్ళాలు ఏవీ వేలానికి అనర్హాలు కాదు. అంటే ఇలా విగ్రహాలు పెట్టి వాటికి పెట్టుబడి పెట్టి మళ్ళీ వేలం వేసి అమ్ముకుంటున్నారు. అంటే ఇదంతా వ్యాపారమైపోయింది. వ్యాపారంగా విస్తరిస్తూనే ఉంది.

దేవుని మీద నమ్మకం ఉంటే ప్రశాంతంగా పూజ చేస్కోవచ్చు. లేదా ధ్యానం చేస్కోవచ్చు. లేదా ఎవరింట్లో వారు పండగ చేస్కోవచ్చు. అంతే కానీ ఈ పండుగ బజారులో చేయిజారి పడిన పండు లా అయిపోయింది.
విగ్రహం సైజులో పోటీలు ఒకదాన్ని మించి ఒకటి పెద్దగా, ఒకదాన్ని మించి ఒకటి వింత భంగిమల్లో ఎన్ని చేస్తారో , పోయినేడు చేసినవి కూడా ఆ యా తయారీ చోటుల్లో అలా పడి ఉంటాయి.


తర్వాత నిమజ్జనంలో మునిగినవి మునగగా కొన్ని విరిగి పడిన ముక్కలు తీసి చెరువులు శుభ్రపరచడం దీనిలో ఏమైనా పవిత్రత మిగిలిఉందా? పూజ చేసిన వాటిని చెత్తలో పడేసినట్టు పడేస్తున్నామా అని ఇక ఎప్పటికీ ఆలోచించమా మనం?
దేవుడిని నమ్మడం, పూజచేయడం నుంచి ఆత్మజ్ఞానం వరకూ వెళ్ళే దారి కనుచూపుమేరలో లేదు. కనీసం చేసే పని అయినా ఒక అంకితభావం లేకుండా మొక్కుబడిగా వ్యాపార వృద్ధి పథకాల మార్గదర్శనంలో వెళ్తూ ఉంటే చివరికి మనలను చూసి మనమే సిగ్గుపడే దారిలో మాత్రమే నిరవధికంగా సాగుతున్నామా? ఎటు పోతున్నాం? 

2 కామెంట్‌లు:

  1. మన సమాజం ఎప్పుడో దారి తప్పిందండి. ముఖ్యంగా బాగా విస్తరించిపోయిన వ్యాపార సంస్కృతికి బలైపోతున్నాం. అంతా వ్యాపార మయమే. విలువలేమీ లేవు.
    “మనలను చూసి మనమే సిగ్గుపడే” సూచనలు నాకైతే కనపడడంలేదు.

    రిప్లయితొలగించండి
  2. ఒకవైపు దీనిని గొప్పగా చెప్పుకునేవారు, ఇంకోవైపు తిట్టిపోసేవారు. మాటలలో ఒకరు, చేతలలో ఒకరు పరస్పరం రెచ్చగొట్టుకుంటున్నారు.

    రిప్లయితొలగించండి