Loading...

18, ఏప్రిల్ 2018, బుధవారం

పది రూపాలకు మంగళమ్.

సీసము-

నీటిలో నొక చేప, నిక్కి చూసెడిదొక
కూర్మమ,దియె చూడు గొప్ప కిటియు,
గర్జించు సింహమ్ము, గరిమ గల వటువు,
విల్లు బట్టెడు వాఁడు, నల్ల చెలుఁడు,
హలము భుజమునున్న బలుఁడ,దొ పరశువు
బట్టిన వాని,దా పదనుఁ గనుము
తురగమ్ము నెక్కుచు తొందర నొచ్చెడు
కల్కి యొక్కడినిటఁ గాంచగలము. 


ఆటవెలది-
 వందనములు పలికి పద్మనాభునికిట
పలుకు పాట వోలె పాడుచుంటి
మంగళముల పాట బంగారు నోటనఁ
బలుకుచుంటి స్వామి పదము చేరి.

7 కామెంట్‌లు:

  1. దైవ పదము అనేది ఒకే పదంగా వాడినప్పుడు శివ సాయుజ్యంతో సమానమైన సందర్భాలలోనే విన్నానండీ.
    స్వామి పదము చేరి అంటే సరిపోతుందేమో కదా?

    రిప్లయితొలగించండి
  2. ఔనా, సరేనండి మారుస్తాను. ఆ దైవపదము/శివసాయుజ్యము చేరేవరకూ స్వామి పదము చేరి అంటానైతే.
    ధన్యవాదాలు మీకు.

    రిప్లయితొలగించండి
  3. వివిధ రకాల భక్తులకు సమాధానం కలిగించడానికి వివిధరకాలైన రూపాలు ధరించాడు.
    క్లాసులో డిబేట్ లో పాల్గొనగలిగే విద్యార్థులకు, వ్రాతపరీక్షలో పాల్గొనే సామర్థ్యం కలిగినవారికీ కూడా వివిధరకాలైన పరీక్షలు, ప్రోత్సాహకాలు ఉన్నట్టే --
    వివిధ రకాల భక్తులు, దాస్య భక్తులైనా, వైరభక్తులైనా అందరికీ శాంతిని ప్రసాదించడానికి వారికి మనస్సమాధానం కలిగి బంధనాలు నుండి విముక్తి మార్గం వైపు ప్రయాణించడానికి వారు ఉన్న వివిధ స్థితుల్లో, వివిధ రకాల్లోనే అందుబాటులోకి వచ్చి తోడ్పడుతాడు.
    అందుకే అందరి వాడు, అందరికీ అందేవాడు ఆ భగవంతుడు.

    రిప్లయితొలగించండి
  4. ఈ ఆలోచన చేయగలిగేలా ప్రేరేపించిన మీ ప్రశ్న విలువైనది. ధన్యవాదాలు శ్యామలరావు గారూ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీరు దయచేసి నేనిచ్చిన లింక్ వద్దకు వెడితే అక్కడ ఆ పల్లవితో ఒక సంకీర్తనం కూడా ఉన్నదని గమనించగలరు.

      తొలగించండి