Loading...

26, మే 2015, మంగళవారం

ఒల్లకుమమ్మా!


మంగళదాయిని మా గౌరి
జంగమరాయని శ్రీ గౌరి
సింగముపై కొలువై యుండే
బంగరు తల్లీ, మముఁ గనుమా!


త్రుంచగ లోభము, మోహము తొలగగ..
సంచిత కర్మల సంగము విడువగ..

మంచీ చెడులూ నిండిన జగమున
నెంచి మసలుకొను తెలివిడి నిడుమా! ॥ మం॥


కంటికి కనపడు కాయము కతమున
నంటును పాపము పుణ్యములన్నియు..

కంటకమగునవి మోక్షపు దారుల
నొంటరిగా విడ నొల్లకు మమ్మా!
                          
   *         *         *

4 కామెంట్‌లు:

  1. హంసగామిని రాక; ప్రకృతికి వేడుక ; మందాకినీ తూలిక; భక్తి గీత వేదిక -
    మంగళ దాయిని గౌరిని వర్ణించిన
    శైలి, లయ చాలా బాగున్నవి లక్ష్మి గారూ!

    రిప్లయితొలగించండి
  2. హంసగామిని రాక; ప్రకృతికి వేడుక ;
    మందాకినీ తూలిక; భక్తి గీత వేదిక -
    మంగళ్దాయిని గౌరిని వర్ణించిన శైలి, లయ చాలా బాగున్నవి లక్ష్మి గారూ!

    రిప్లయితొలగించండి
  3. కాదంబరి గారూ,
    మీ ఆత్మీయమైన పలకరింపు, అభినందన చాలా బాగా అనిపించిందండీ, పవన వీచిక లాగా ఆహ్లాదంగా.

    రిప్లయితొలగించండి