Loading...

1, డిసెంబర్ 2012, శనివారం

దైవం పేరుతో....

  సృష్టికి మూలమని నమ్మి దైవాన్ని ఆరాధించడం కాకుండా దైవభక్తి కూడా ఒక ఫ్యాషన్ గానో, సక్సెస్ ఫార్ములా గానో పెట్టుకోవడం కొత్త వింతగా తయారయింది. మన చలన చిత్రాల్లో నాయిక/నాయకుడు దైవభక్తులయి (తర్వాత క్రిమినల్స్ కావటం కూడా మర్చిపోరులెండి.)ఉండడం మిగతా వారు దానిని అతిగా భావిస్తూ సరదా పేరిట వ్యాఖ్యలు చేస్తూ ఉండడం మామూలుగా కనిపిస్తున్నాయి.
                      దైవం పేరుతో సెంటిమెంట్ ఉన్నవాళ్ళని, లేని వాళ్ళని కూడా కాష్ చేసుకోవడమే ఉద్దేశ్యంగా ఉన్నట్టుంది.
               ఇక సినిమాలను మించిపోతూ, ఈ మధ్య వ్యాపారప్రకటనల్లో కూడా మంత్రాలను కూడా నోటికొచ్చినట్టు పలుకుతూ, మారుస్తూ వాడేస్తున్నారు. దీనికంతా వ్యాపారదృక్పథం ఉన్నవాళ్ళే కాదు లేని వాళ్ళే ఎక్కువ సహాయం చేస్తున్నారు. వేదమంత్రాలను , అర్చనలను అన్నిటిని గురువు వద్ద శిష్యులు నేర్చుకోవడం ఉండేది. పూజ చేసేటప్పుడు శుద్ధులై మాత్రమే పలికేవారు.

ఏదైనా తప్పు పలికినా క్షమించమని దైవాన్ని అడిగేందుకే ఒక శ్లోకం ఉన్నది.

యదక్షర పదభ్రష్టం మాత్రా హీనం తు యద్భవేత్|
తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తు తే||


అంత నిష్ఠగా ఉచ్చరించడం పోయి నిర్లక్ష్యం ఎక్కువయింది.

ఇప్పుడన్నింటిని సీడిలు, ఇంటర్నెట్లలో ఉంచడం వల్ల ఎక్కడబడితే అక్కడ ఎప్పుడుబడితే అప్పుడు అన్ని మంత్రాలూ వినిపిస్తాయి. కళ్ళకు ఱెప్పలిచ్చినట్టు చెవులకు కూడా ఏదైనా ఉంటే బాగుండేదనిపిస్తుంది. మనం మాట్లాడే తెలుగే మనకు సరిగ్గా రానప్పుడు మంత్రాలను శ్లోకాలను పాడే దుస్సాహసం చేయడం ఎందుకు? అపస్వరం అంటే కూడా తెలియకుండా, గురువు నేర్పకుండా పాడేస్తుంటే వినలేకపోతున్నాము.

2 కామెంట్‌లు:

  1. చాలా బాగా చెప్పారు లక్ష్మి గారు. ఈ విషయమై కామెంట్ చేయాలి అంటే మళ్ళీ ఒక పోస్ట్ అవుతుంది. దైవం పేరిట చేసే చేష్టలు లో పైత్య ప్రకోపం బాగా కనబడుతుంది. ఎప్పుడు పడితే అక్కడ ఎక్కడ పడితే అక్కడ..విచక్షణ రహితంగా మంత్రాలు చదవడం,వినిపించడం.. ఇలా చాలానే ఉన్నాయి. విమర్శించడం కాదు కాని..అర్ధం తెలుసుకుని గురుముఖంగా నేర్చుకుని మంత్రోచ్చారణ చేసుకుంటే బావుంటుంది అని నా అభిప్రాయం కూడా!
    భక్తి ప్యాషన్ కాదు..భక్తి అంటే మనసారా అంకిత మొనర్చి చేసే సేవ అనుకుంటాను నేను.

    రిప్లయితొలగించండి
  2. వనజ గారు,
    నిజమే నండి. ప్రతి విషయాన్నీ ఇంకొంచెం విశ్లేషించి వ్రాద్దామనుకొని కూడా క్లుప్తంగానే వ్రాసినాను. మీరు నా అంతరంగమందున్న విషయాన్ని సమర్థిస్తున్నందుకు సంతోషం. ధన్యవాదాలండి మీ స్పందనకు.

    రిప్లయితొలగించండి