Loading...

27, అక్టోబర్ 2011, గురువారం

కార్తీకం




                                                                    ఈరోజు కార్తీక శుద్ధ పాడ్యమి. ఈ రోజు తో కార్తీక మాసం మొదలవుతుంది. ఈశ్వర, నారాయణ రూపాల్లో ఏ రూపాన్ని ఆరాధించే వారయినా ఈ మాసం మరింత భక్తి శ్రద్ధలతో నామ జపం చేసుకునే ఆచారం ఉంది. కార్తీక మాసంలో ప్రతిరోజూ సంధ్యాసమయంలో ఇంటి ముందు మట్టి ప్రమిదలతో కడుప్మాను (గడప) ముందు రెండువైపులా రెండు దీపాలు పెట్టే ఆచారము ఉంది.

                                                                       దీపావళి అమావాస్యకు ముందు రోజు నరకచతుర్దశిరోజు తో మొదలుపెట్టి, నరకచతుర్దశి, దీపావళి రోజుల్లో వరుసగా అనేక దీపాలు పెట్టినా తర్వాత రెండు దీపాలు మాత్రం పెడుతూ వస్తాం నెలంతా. ఈ నెల దీపదానం , కంబళీదానం ప్రశస్తమైనది అని చెపుతారు. త్వరగా చీకటి పడే రోజులు కాబట్టి దీపాల అవసరం, చలి మొదలయ్యే రోజులు కాబట్టి కంబళీ అవసరం గుర్తించిన పెద్ద వారు ఆ రోజుల్లో  ఏర్పరచిన ఆచారాలివి
                                         
                                              నిరంతరం అందరి గురించీ ఆలోచించి పరస్పర సహాయ సహకారాలతో సమాజం జీవించాలని మన పూర్వీకులు ఇలాంటి నియమాలను పెట్టారు. కార్తీక మాసంలో చన్నీళ్ళ స్నానమే చెయ్యాలంటారు. అదెందుకో తెలీదు కానీ, రోజూ చన్నీళ్ళ స్నానాలు చేస్తున్నా కార్తీకం వచ్చేసరికి నీళ్ళు మరీ చల్లబడి వేణ్ణీళ్ళు కావాలనిపించటం వింతగా ఉంటుంది.

                   
                                                                                ఇక కార్తీక మాసం లో శుద్ధద్వాదశినాడు క్షీరాబ్ధి/చిలుకద్వాదశి అని సర్వరోగనివారిణి, సకలశుభదాయిని అయిన తులసి మాత పూజ జరుపటం విశేషం. తలంటి నీళ్ళు పోసుకొని వంట చేసి తులసికి నైవేద్యం చేయటం, సాయంకాలం నలుగురిని పిలిచి తాంబూలాలు ఇచ్చుకోవటం ముఖ్యం. నా చిన్నతనం లో తెల్లవారేసరికి తులసి దగ్గర అమ్మ వెలిగించే దీపం (నూటఎనిమిదేమో మరి) నాకింకా కళ్ళలోనే ఉంది. మా ఇంట్లో నాలుగడుగల ఎత్తు బృందావనం హుందాగా నిలబడి ఉండేది. అందులో తులశమ్మ, ముందుభాగములో ఇద్దరు కూర్చునేంత  అరుగు లా ఉండేది. సాయంకాలం అక్కడ కూర్చుని కబుర్లు చెప్పుకోవటం, మా చిన్న చిన్నాన్న మూడో కూతురికి ళ శ్రద్ధగా పలికించటం మనసులో అప్పుడప్పుడూ మెదలుతూ ఉంటాయి.

15 కామెంట్‌లు:

  1. మందాకిని గారూ మనం ఈ కాలంలో చన్నీళ్ళ స్నానం చేయాలన్న ఆచారం పెట్టారు అంటే ఈ సమయంలో మన వేదాలన్నీ భూగర్భంలో దాక్కున్నాయి కదా! అందుకని మనం నదులలో, సముద్రాలలో, ఆఖరికి చిన్న గోతిలో నీళ్ళు నిలువ ఉన్నా ఆ నీళ్ళతో చేయటం మంచిది అని చెప్పారు. అలానే కార్తీకమాసం లో రాత్రి సమయాల్లో భూగర్భ జలంలో శక్తియుక్తమైన అయస్కాంత మండలం ఉంటుంది. ఈ మాసంలో నదీప్రవాహంలో ఓషధుల సారం ఉంటుంది. అందువలన ఆ నీళ్ళతో స్నానం చేయాలంటారు.
    కొంచెం శాస్త్రీయంగా చెప్పాలంటే.. ఈ కాలంలోనే మనకి బద్ధకం, వాతావరణ మార్పుల వలన రోగాలు ఎక్కువగా రావడం, శరీరం పనులు చేయడానికి ఎక్కువగా సహకరించకపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి ఇది ఈ ఋతు ధర్మం. వీటన్నిటికీ విరుగుడు చన్నీటి స్నానం. ఇలా ఎన్నో విధాలుగా ఆలోచించి పెట్టడం జరిగింది. ఏదో నాకు తెలిసినది చెప్పాను!

    రిప్లయితొలగించండి
  2. రసజ్ఞ గారు,
    చక్కటి వివరం తెలిపారు. ఈ విషయం నాకింత వరకూతెలీదు. బహుళముగా ధన్యవాదాలు మీకు.

    రిప్లయితొలగించండి
  3. కార్తీకమాసం గురించి చాలా బాగా చెప్పారండీ..
    మేము కూడా ఈ నెలలో కార్తీకపౌర్ణమికి కేదారీశ్వర వ్రతం చేసుకుంటాము.
    మీ కార్తీకమాసం జ్ఞాపకాలు చాలా బాగున్నాయి

    రిప్లయితొలగించండి
  4. రాజి గారు,
    ఆ కేదారీశ్వర వ్రతం గురించి కూడా విన్నాను, చదివాను కానీ ఇంట్లో చేస్తామన్నారు కాబట్టి వివరాలు వ్రాయండిమరి. వాటికి సంబంధించిన కథలూ అవీ పెద్దలు చెప్పిన కథలు ఉంటాయికదా!
    ధన్యవాదాలండి మీకు.

    రిప్లయితొలగించండి
  5. కార్తీకం అంటే మా రాజమండ్రి గోదావరి, తెల్లారగట్లే పుష్కర రేవు కి స్నానాలకి వెళ్ళడం ఇలాఎన్నోఎన్నెన్నో జ్ఞాపకాలు గురుకుస్తాయి. మా నాన్నమ్మ గారు, నాన్నగారుఇంకా ఫై లోకాలకి వెళ్లి పోయిన పెద్దవాళ్ళు గుర్తుకుస్తారు. ఆ జ్ఞాపకాలు గుండె లోతుల్ని అలా ఒక్కసారి తట్టుతాయి.
    మీరు ఎన్నోవిషయాలు వ్రాసారు చాల బావున్నాయి. ఇలా మీరు రాస్తూనే వుండాలని కోరుతూ

    ఒక తెలుగు అభిమాని

    రిప్లయితొలగించండి
  6. పారిజాతం గారు ధన్యవాదాలండి. మీ ఫోటోలో పారిజాతం చాలా బాగుంది. మీరొకటి గమనించారా! నా మాలతీ మాధవం బ్లాగ్ యు ఆర్ ఎల్ పారిజాతం. :-)

    రిప్లయితొలగించండి
  7. చిన్నాన్న కూతురికి "ళ" శ్రధ్ధగా పలికించడం దగ్గర రెండో సారి హృదయం గెలుచుకున్నారు. :) మంచి టపా!!

    రిప్లయితొలగించండి
  8. మీ దృష్టిలో పడటం సంతోషమండీ....మీ అందమైన మాటల ఝరుల్లో ప్రవహించే అందాన్ని చూసి మైమరిచే పాఠకురాలిని నేను.

    రిప్లయితొలగించండి
  9. మీ బ్లాగ్ ఎంతో నచ్చుతుంది నాకు. చక్కగా కుర్చుని ఖబుర్లు చెప్పుకుంటున్నట్లు మనసుకు ఆనందం కలుగుతుంది.
    మా గోదావరి, మా రాజమండ్రి దీని గురుంచి అలా అలా మాటల ఊట వూరుతూనే వుంటుంది.ఎన్నోగోదారి ఊసులు,
    ఎంతచెప్పుకున్న తరగనివి అలా మీ బ్లాగ్ లో మంచి
    విషయాలు వుంటాయి

    రిప్లయితొలగించండి
  10. అరవింద గారు,
    మిమ్మల్నిలా పిలిచినందుకు ఏమనుకోకండి. మరెలా పిలవాలో తెలియలేదు. ధన్యవాదాలండి మీ అభిమానానికి. అంత అందమైన గోదారమ్మతో నా బ్లాగును పోల్చినందుకు మురిసిపోయానంటే నమ్మండి.

    రిప్లయితొలగించండి
  11. ఈ సారి వ్యాఖ్యలు ప్రచురించటం ఆలస్యమైనందుకు మిత్రులను అన్యథా భావించవద్దని మనవి.

    రిప్లయితొలగించండి
  12. పోలిస్వర్గం

    రేపు పోలిస్వర్గం! దీని గురుంచి ఒక కధ వుంది మా అమ్మగారు చెప్పారు.
    స్త్రీల వ్రతకదల పుస్తకం లోకూడావుంది

    అనగా అనగా ఒక ఊరులో,అన్ని కులాల వాళ్ళు నివసిస్తూ వుంటారు అందులో చాకలి కులం
    వారు వుంటారు. పోలి అనే ఆవిడ ఎప్పుడు దేవుణ్ణి భక్తిశ్రద్ధలతో కొలుస్తూ వుంటుంది.
    మిగత తోటికోడళ్ళు ,అత్తగారు ఆమెని చిన్న చూపు చూస్తారు. ఎప్పటి
    లాగే వచ్చే కార్తిక మాసం ఆఖరిరోజున నది కి వెళ్లి దీపాలు వెలిగించాలని అనుకుంటుంది. కాని అత్తగారు
    మిగిలిన కోడళ్ళు ఆమెకి చెప్పకుండా నది దగ్గరకి వెళ్ళిపోతారు. ఆమెకి
    వత్తులు, నెయ్యి మొదలయిన సంబరాలు ఉంచకుండా చేస్తారు.
    అప్పుడు ఆమె దేవుణ్ణి తలచుకుంటూ ఉన్నవాటి తో తయారు చేసుకొని నది కి వెళ్లిదీపాలు వదులుతుంది.
    అది చూసి దేవతలుఆమెని బొందితో స్వర్గానికి తీసుకువెళ్ళడానికి పుష్పకవిమానం లోవస్తారు.
    అది చూసిఊరులో వాళ్ళు ఆమె అత్తా,తోటికోడళ్ళు ఆహ ఎంత భాగ్యం, ఎంతపుణ్యం కదా! మన
    పోలి బొంది తో స్వర్గం కి వెళ్ళింది అని ఆమె గురుంచి వేనోళ్ళ పోగుడుకుంటారు.

    అప్పటి నుంచి ప్రతి కార్తిక మాసం చివరరి
    రోజున
    " పొలమ్మ స్వర్గం అందరు చేస్తున్నారు"

    రిప్లయితొలగించండి
  13. అరవింద గారు,
    అరె, ఈ పోలాల అమావాస్య అనే పేరుతో ఎప్పుడో విన్నట్టు గుర్తు. అందుకే ఒకరిద్దరిని అడిగితే తెలీదన్నారు. నా మనసు తెలిసి నట్టుగా వచ్చి చెప్పినందుకు ఈ రోజు కు సంబంధించిన ఈ కథ నాకు తెలియజేసినందుకు మరీ మరీ ధన్యవాదాలు మీకు.

    రిప్లయితొలగించండి