Loading...

27, సెప్టెంబర్ 2011, మంగళవారం

శరన్నవరాత్రులు

           దేవీ నవరాత్రులు, శరన్నవరాత్రులు ఏ పేరుతో పిలిచినా దేవీ పార్వతి ని కొలిచే శుభదినాలివి. అమ్మవారు పార్వతీ, సరస్వతీ, లక్ష్మీ రూపాలతో మనలను అనుగ్రహించమని వేడినవారికి వేడని వారికి అందరికీ శుభాలను ప్రసాదించి, ధైర్యాన్ని, తద్వారా విజయాన్ని, జ్ఞానాన్ని తద్వారా ముక్తిని, సంపత్తును తద్వారా పరోపకారం చేయగల శక్తిని ప్రసాదిస్తూ ఉండే కరుణాస్వరూపమైన అమ్మవారిని స్మరిద్దాం.

         ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలు దశమి వరకూ అమ్మవారిని వివిధ ఆలయాల్లో వివిధరూపాలుగా అలంకరింపచేసి, మనకు దర్శన భాగ్యం కలిగిస్తారు గుళ్ళో అర్చకులు. వారికి ముందుగా అభివందనాలు.

            భీకరస్వరూపస్వభావాలు గలిగిన రాక్షసులను వివిధ రకాలుగా అంతమొందించిన అమ్మవారి మహిషాసుర మర్దినీ రూపం, ఆ స్తోత్రం అందరినీ ప్రభావితం చేస్తాయి.

              కనకదుర్గ, కాళీ, మహిషాసుర మర్దిని రూపాల్లో దేవిని పూజించటం చాలా చోట్ల కనిపించినా కొన్ని చోట్ల విజయదశమి సందర్భంగా పిల్లలకు మొదటిసారి పాఠశాలా ప్రవేశం చేయించటం మంచిదని విజయదశమి రోజు చేస్తుంటారు.

         చదువుకుంటున్న పిల్లలకు శలవులు అయిపోయి విజయదశమి రోజు తప్పని సరిగా చదవాలని బళ్ళు తెరవటం కూడా జరుగుతుంటుంది.

            మరికొన్ని చోట్ల శ్రావణమాసంలో వరలక్ష్మీ వ్రతం చేసుకోవటానికి అనుకూలం కాకపోతే కూడా నవరాత్రుల్లో ఒక రోజు వరలక్ష్మీ వ్రతం చేసుకుంటారు.

            ఏరూపంలో కొలిచినా సృష్టికి మూలకారకమయిన శక్తి స్వరూపం ఒక్కటేనని మనందరికీ తెలుసు.
చిట్టిగౌను వేసినా, పట్టులంగా ,రవిక వేసినా, పైట వేసినా, చీరకట్టినా కన్నకూతురి మీద ఒకే ప్రేమే ఎలాగో అలాగన్నమాట.

            ఆ దేవి సకల జనులకూ శాంతి సౌభాగ్యాలను కల్గించాలని కోరుతూ ఈ వేళ తల్లిని ప్రార్థిద్దాం.

6 కామెంట్‌లు:

  1. Beautiful.
    మీకూ మీ కుటుంబానికి కూడా ఆ తల్లి అనుగ్రహం కలుగుగాక

    రిప్లయితొలగించండి
  2. కొత్తపాళీగారు, ధన్యవాదాలు.
    మీకందరికీ దసరా శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  3. శశికళ గారు, ధన్యవాదాలండి.దసరా బాగా జరుపుకుంటున్నారా?

    రిప్లయితొలగించండి
  4. నమస్కారములు.
    మందాకిని గారూ ! మీ పేరులానే మీ ఆర్టికల్ కుడా బాగుంది. మీకు మీ కుటుంబ సభ్యు లందరికీ విజయ దశమి శుభా కాంక్షలు

    రిప్లయితొలగించండి
  5. అక్కయ్యగారు,
    ధన్యవాదములు. మీకు మీవాళ్ళందరికీ కూడా దసరా శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి