Loading...

21, ఫిబ్రవరి 2010, ఆదివారం

చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా

చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా
గతమెంతో ఘన కీర్తి గలవోడా

వీర రక్తపు ధార వార వోసిన సీమ
పలనాడు నీదెరా వెలనాడు నీదెరా
బాల చంద్రుడు చూడ ఎవరోడోయ్
తాండ్ర పాపయ కూడ నీవోడోయ్ ||చెయ్యెత్తి ||

నాయకీ నాగమ్మ, మంగమాంబ, మొల్ల
మగువ మాంచాల నీ తోడ బుట్టిన వోళ్ళె
వీర వనితల గన్న తల్లేరా
ధీర మాతల జన్మ భూమేరా ||చెయ్యెత్తి ||

కల్లోల గౌతమి వెల్లువల క్రిష్ణమ్మ
తుంగభద్రా తల్లి పొంగిపొరలిన చాలు
ధాన్య రాశులు పండు దేశాన
కూడు గుడ్డకు కొదువ లేదోయి ||చెయ్యెత్తి ||

పెనుగాలి వీచింది అణగారి పోయింది
నట్టనడి సంద్రాన నావ నిలుచుండాది
ముక్కోటి బలగమై ఒక్కటై మనముంటే
ఇరుగు పొరుగూలోన ఊరు పేరుంటాది
తల్లి ఒక్కటె నీకు తెలుగోడా
సవతి బిడ్డల పోరు మనకేలా? ||చెయ్యెత్తి ||
==వేములపల్లి శ్రి కృష్ణ

11 కామెంట్‌లు:

  1. నేను అయిదవ ఫారం హాయిస్కూల్ లో చదివే టప్పుడు(1950) ఏదోసినిమాలో వచ్చింది గుర్తు లేదు. నాకు బాగా నచ్చిన చరణాలు
    "పెనుగాలి వీచింది అణగారి పోయింది
    నట్టనడి సంద్రాన నావ నిలుచుండాది"
    వాటి తరువాత "చుక్కాని పట్టరా తెలుగోడ నావ నడిపేట్టరా మొనగాడా" అని బాగా గుర్తు. నేను తెగ పాడుకునే వాణ్ని. అది ఇది ఒకటేనా.
    పోస్టింగ్ చేసినందుకు థాంక్స్.

    రిప్లయితొలగించండి
  2. Look

    He did not mention our "NIZAM" in this
    all Andhra conspiracy.

    రిప్లయితొలగించండి
  3. లక్కరాజు గారూ!
    అంత పాత సినిమాల గురించి నాకు తెలీదండీ!
    ఇది ఒక దేశ భక్తి గీతమని మాత్రం తెలుసు.
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  4. అఙ్ఞాత గారూ!
    నిజాం పరిపాలన మహమ్మదీయులది కదండీ! అంటే మన దేశం మీదికి మహమ్మదీయులు దండెత్తి వచ్చేదాకా కరీంనగర్, మహబూబ్ నగర్ ఏవీ లేవంటారా భారత దేశంలో? స్వతంత్ర పోరాట భక్తి గీతాల్లో మన మీద దాడి చేసిన వారిని కీర్తించరండీ! మన దేశం కోసం పోరాడినవారిని స్మరించుకుంటారు.
    ఇంకా మన ప్రాంతాల గురించి చెప్తారు. అయితే గౌతమి నది అంటే = గోదావరి నది గురించి ఉంది కదా! లేదంటారా ?
    ముక్కోటి బలగమై అంటే = మూడు కోట్లు జనాభా ఉన్నప్పటి పాట ఇది.
    ఒక్కటై మనముంటే అంటే = విడి పోకూడదనే !
    మహబూబ్ నగర్ జిల్లా అలంపూర్ లో క్రిష్ణమ్మ లేదంటారా?
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  5. వేములపల్లి శ్రీకృష్ణ అని ఒక గుంటూరు కమ్మ్యూనిస్టు, ఆయన రాశారు ఈ పాటని.

    రిప్లయితొలగించండి
  6. ప్రసాద్ గారూ!
    ధన్య వాదాలండి.
    తప్పు సరి చేసుకున్నాను.

    రిప్లయితొలగించండి
  7. మీ తప్పును సరిచేసింది "రావు లక్కిరాజు" గారండీ...మీరు రచయిత గురించి ఏమీ చెప్పలేదు కదా..! :-) . ఈ పాట మనలో తెలుగు వారమనే గర్వాన్ని ఆత్మాభిమానాన్ని నింపుతుంది. ఏ దేశమైనా నిజం గా ముందుకు పోవాలంటే ఆత్మాభిమానం ముఖ్యం. ఏదో బహుళజాతీయ సంస్థలలో కూలీ పని చేసుకొందాములే అనుకొనే వాళ్ళకి ప్రైడ్ అవసరం లేదు.

    రిప్లయితొలగించండి
  8. నా చిన్నప్పుడు,1984లో ఈ పాటను తెలుగుదేశం ప్రచారంలో విపరీతంగా వినిపిస్తూంటే విన్నాను.నాకు చాల ఇష్టమైన పాట ఇది.ఈ పాట చండశాసనుడు సినిమాలో కూడా ఉన్నట్లుంది.

    రిప్లయితొలగించండి
  9. నా చిన్నప్పుడు,1984లో ఈ పాటను తెలుగుదేశం ప్రచారంలో విపరీతంగా వినిపిస్తూంటే విన్నాను.నాకు చాల ఇష్టమైన పాట ఇది.ఈ పాట చండశాసనుడు సినిమాలో కూడా ఉన్నట్లుంది.

    రిప్లయితొలగించండి
  10. నేనూ విని ఆనందించడమే కానీ ఎక్కడిది అనే వివరాలు పెద్దగా తెలీవండీ శ్రీకాంత్ గారూ!

    రిప్లయితొలగించండి