Loading...

16, జులై 2022, శనివారం

ఆడఁజేసెదవు

 

వెన్నల ముద్దలందినిన వేళల బల్మి యదెట్టిదో, సదా

వెన్నవు గా కరుంగుదువు, వేణువుఁబట్టినదేముహూర్తమో

వన్నియకాడ! లాగెదవు పాటలనాటల, నన్నునెప్పుడున్

సన్నలనాడజేసెదవు చందనచర్చల నూరడించుచున్. 

--లక్ష్మీదేవి.

 (పాతదే)

11, జులై 2022, సోమవారం

విందు

 రోకలి క్రిందుమీదగుచు రోళుల సవ్వడి పక్కవాద్యమై,

సోకగు పల్లెభామినులు సొంపగు గాజులు రవ్వళింపగా,

లోకపు రీతిగీతికల లోలతఁబాడిరి, కేలు తీవలౌ

పోకలు నాట్యభంగిమల పోడిమి కన్నుల విందుసేయగా.


- యోగీశ్వర కవి సంస్కృత పద్యభావానికి తెలుగు రూపం.

లక్ష్మీదేవి.

ఉత్పలమాల.