Loading...

27, ఏప్రిల్ 2021, మంగళవారం

ఇదే స్థితి

 

పాలకులు - సలహాదారులు
సంస్కృత కవి భారవి వ్రాసిన కిరాతార్జునీయం లో ధర్మరాజు తరఫున హస్తినకు గూఢచారిగా వెళ్ళిన ఒక వనచరుని పాత్ర ధర్మరాజు పాత్రతో ఇలా అంటుంది.
పాలకునికి సరైన సలహా ఇవ్వని సఖుడు ఏమి సఖుడు?
సఖుని సరైన సలహాను స్వీకరించని పాలకుడు ఏమి పాలకుడు?
పాలకులు, వారి సలహాదారులు ఒకరికొకరు అనుకూలంగా ఉన్నప్పుడే సర్వసంపదలూ ప్రియంగా, స్థిరంగా నిలిచి ఉంటాయి.
स किं सखा साधु न शास्ति योऽधिपं हितान्न यः संश्रुणुते स किंप्रभुः |
सदानुकूलेषु हि कुर्वते रतिं नृपेष्वमात्येषु च सर्वसम्पदः ||
మొదటి సర్గ ఐదో శ్లోకం.
-
చెప్పుకోడానికి ఆదర్శంగా ఇది బాగుంది. కానీ ఆచరణలో జరిగేదేమిటి? (పాలకులు, సలహాదారులు ఇద్దరూ నిజాయితీపరులు, సేవాతత్పరులు అయినప్పటి సంగతే, కానప్పుడు చర్చించడానికేమీ లేదు. మునిగిపోడమే)
వీరిద్దరిలో ఎవరు మొండివాళ్ళు/మాటకారులు/నాకు అంతా తెలుసు, నీకేం తెలుసు అనుకునే వాళ్ళైతే వారి మాట చెల్లుతుంది.
అంతే, అదే జరిగేది.
కుటుంబంలో, కార్యాలయాలలో, సంఘాలలో కూడా ఇదే స్థితి.

6, ఏప్రిల్ 2021, మంగళవారం

ఐపాయ..

 ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు, వచనం చిత్రం కావచ్చు