Loading...

11, జులై 2019, గురువారం

వాన వర్ణన


సంస్కృత కవులు ఎంతో అందంగా వ్రాస్తారు. ఇప్పుడు వర్షం గురించి పేరు తెలీని కవి వ్రాసిన చాటువు చూస్తే తెలుగులో వ్రాసుకుందామనిపించింది. ఏదో కిట్టించినట్టుందనుకోండి. ఒక అల్పానందం.

ఆనందాంకిత లోచనమ్ముల మయూరమ్మాటలాడంగ, ప్రాం
గాణంబెల్లెడ గీలు బీద సతిదౌ కన్నీరుగా తోచగా,
దీనంబై కళగానరాని విరహార్తీ వక్త్ర రూపమ్ముగా,
స్నానంబౌ ఋతువై ధరన్ తడిపె నిచ్ఛానిచ్ఛలై చిన్కులున్.

మయూరాలు ఆనందంతో చూసి నర్తిస్తుండగా, ప్రాంగణమంతా వర్షానికి కారుతున్న ఇల్లు గల ఇల్లాలు కంటతడిగా కనిపిస్తుండగా, విరహార్తి ముఖంలా కళతప్పినట్టుగా, ధరకు స్నానమనదగిన ఋతువు అవుతూ , ఇలా ఇష్టాలు, అయిష్టాల రూపంగా చిన్కులు ధరను తడుపుతున్నాయి.

(సంస్కృత పద్యంలో ఇంకా  ధూళి కణాలున్న మబ్బు అని కూడా ఉందని పండితులు అర్థాలు వ్రాశారు. సహజమైన వర్ణన. ఇమడ్చలేకపోయాను. 😔)

కించిన్ముద్రిత పాంశవః శిఖికులైః సానందమాలోకితా
భగ్నావాసరుదద్దరిద్రగృహిణీశ్వాసానిలైర్జర్జరాః ।
ఏతే తే నిపతంతి నూతనఘనప్రావృడ్భవారమ్భిణో
విచ్ఛాయీకృత విప్రయుక్తవనితా వక్త్రేన్దవో బిన్దవః ॥

                             ---- చాటువు. (కవి పేరు తెలియదు)