Loading...

11, జులై 2019, గురువారం

వాన వర్ణన


సంస్కృత కవులు ఎంతో అందంగా వ్రాస్తారు. ఇప్పుడు వర్షం గురించి పేరు తెలీని కవి వ్రాసిన చాటువు చూస్తే తెలుగులో వ్రాసుకుందామనిపించింది. ఏదో కిట్టించినట్టుందనుకోండి. ఒక అల్పానందం.

ఆనందాంకిత లోచనమ్ముల మయూరమ్మాటలాడంగ, ప్రాం
గాణంబెల్లెడ గీలు బీద సతిదౌ కన్నీరుగా తోచగా,
దీనంబై కళగానరాని విరహార్తీ వక్త్ర రూపమ్ముగా,
స్నానంబౌ ఋతువై ధరన్ తడిపె నిచ్ఛానిచ్ఛలై చిన్కులున్.

మయూరాలు ఆనందంతో చూసి నర్తిస్తుండగా, ప్రాంగణమంతా వర్షానికి కారుతున్న ఇల్లు గల ఇల్లాలు కంటతడిగా కనిపిస్తుండగా, విరహార్తి ముఖంలా కళతప్పినట్టుగా, ధరకు స్నానమనదగిన ఋతువు అవుతూ , ఇలా ఇష్టాలు, అయిష్టాల రూపంగా చిన్కులు ధరను తడుపుతున్నాయి.

(సంస్కృత పద్యంలో ఇంకా  ధూళి కణాలున్న మబ్బు అని కూడా ఉందని పండితులు అర్థాలు వ్రాశారు. సహజమైన వర్ణన. ఇమడ్చలేకపోయాను. 😔)

కించిన్ముద్రిత పాంశవః శిఖికులైః సానందమాలోకితా
భగ్నావాసరుదద్దరిద్రగృహిణీశ్వాసానిలైర్జర్జరాః ।
ఏతే తే నిపతంతి నూతనఘనప్రావృడ్భవారమ్భిణో
విచ్ఛాయీకృత విప్రయుక్తవనితా వక్త్రేన్దవో బిన్దవః ॥

                             ---- చాటువు. (కవి పేరు తెలియదు) 

27, మే 2019, సోమవారం

ఏకాగ్రత

లువిధ చింతనలందున
గిన, నేకాగ్రత మది లుగునె మనసా?
విలువగు వ్యవసాయమ్ముల
సిన నేకాగ్రత నిలుగ మేల్కొనుమా!

20, మే 2019, సోమవారం

పాడియే?

చిత్రముగా పరుగులిడుచు
నాత్రముఁ బెంచుచు, ముంచుచు నాశల యూటన్,
గాత్రము నుండగనీయక
పత్రమన రెపరెపలాడఁ బాడియె మనమా?

16, మే 2019, గురువారం

ద్వావృత్తి


ద్వైతమ్మును నమ్ముచు
నుద్వేగముతో మెలిగిన యొండొరులందున్
ద్వర్తనములు వెలివడు
ద్వాక్యమ్ముల యొరవడి పనలఁ బెంచున్. 

14, మే 2019, మంగళవారం

Infinity

నీటి చాలులందు రాతిశిలలు
రాతి శిలల లోన నీటిచాలు


(నీటి చాలు = నీటి పాయ)
(చాలు = జాడ) 

13, మే 2019, సోమవారం

ఊయల గతి

ఆశనిరాశల నూగుచు
పాశపు బంధనము నందు పరుగిడినంతన్
లేశపు దూరముఁ జనదో
యీ! శాపపుటూయలయొ! యదెట్టుల తెలియున్?

8, మే 2019, బుధవారం

ఏలో!

పుట్టితి నేలో! తెలియదు
గిట్టుట యెపుడో! తెలియని కృత్యములన్ చే
ట్టితి నేలో! విడువని
ట్టు యిదేలో! యొకింత క్వత రాదో!
--

16, ఏప్రిల్ 2019, మంగళవారం

ఏమి చేతునో!

నితము నంతరంగముననీకముఁ జేయుచు వేగుచున్న, దే
రుణము నెట్టులౌనొ యని తాళగ జాలని యుత్సుకమ్ము నే
యని కొత్త యూహల, నల్పముగా జనియింపజేయగా
గునఁ జేరు కల్పనల ల్లను యుల్లము నేమి చేతునో!

15, ఏప్రిల్ 2019, సోమవారం

వ్యక్తి పూజలేల?

గుణములఁ జూచుచు గొప్పగా మెచ్చుచు
                    వ్యక్తి పూజలు సేయ వ్యర్థమగును 
 గుణములఁ బాటింప గొప్పదనము గాని
              పొగడుచు నుండిన పొల్లు సమము
నాటి కావ్య పురాణ నాయకులనుఁ గాని
              నేటి వారలఁ గాని నిక్కమిదియె
మాటల మూటల ర్మంపు కథలందు
                   కోటలు దాటింప గొప్పకాదు

యుగము దాటి మరల యుగములు గడచిన
నింత యేని యెఱుగ కేమి ఫలము?
చెప్పు వారు చెప్పి చెప్పి యూరకనుండ
డుసుఁ ద్రొక్కి చూడ నాశ లేల? 

16, ఫిబ్రవరి 2019, శనివారం

స్వయంకృతాపరాధమే

                         ఆత్మాహుతి జీహాదీ , మళ్ళీ పెద్ద సంఖ్య (ఈమధ్య కాలం) లో సైనికుల దుర్మరణం, మళ్ళీ అన్ని మీడియాల్లో నిప్పులు గ్రక్కడం, మళ్ళీ ఎమ్ ఎఫ్ ఎన్ స్టేటస్ తీసేయడం, మళ్ళీ  (నేరస్తులకు తగిన శిక్షల) అవే ప్రకటనలు, మళ్ళీ రెండు రోజులకు అదే ఆక్రోశాల వీధికి ఇంకొక ఘటన అతిథిగా వస్తే దీన్ని వదిలేసి మరిచిపోవడం. ఎన్నిమార్లిలా?
                ఎందుకు ఆవేశాలిలా అనేది ఇప్పటి నా సందేహం. అందాల కాశ్మీరు అఘాయిత్యాల ప్రదేశం గా మారి ఎన్నేళ్ళయింది? రోడ్ల మీద జవాన్ల దారిలో ఎన్ని సార్లు బాంబులు నాటారు? ఎన్ని సార్లు సూయిసైడ్ అటాకర్లు వచ్చారు? ఈ నాటి సమాచారయుగంలో ఇది ముందుగా కనిపెట్టడం , నివారించడం, కనీసం ఎదుర్కొనే సంసిద్ధత లేకపోవడం ఎలా? (రెండు రోజుల ముందు ట్విట్టర్ లో ఈ వార్త తిరిగిందని వదంతి)పైగా వెహికిల్ వేస్కుని వందలకేజీల విస్ఫోటకాలు పట్టుకొస్తూంటే అంత పెద్ద డెబ్భైఎనిమిది వాహనాల కాన్వాయ్ దగ్గరికి చేరుతుంటే ఎలా ఆపలేకపోయారు? ఆకాశం నుంచైతే ప్రత్యక్షం కాలేదు గా?మనకు చేతగాలేదు ఇక ఈ ఆర్భాటపు పలుకులెందుకు?

            యుద్ధం చేయాలని, బుద్ధి చెప్పాలని ఈసారి లెఫ్ట్ రైట్ లన్నీ రెచ్చిపోతున్నాయి. అసలు కనిపించని శత్రువుతో ఎవరు ఎలా యుద్ధం చేయగలరు? ఆర్మీకి ఫ్రీ హేండ్ ఇచ్చారట. ఇస్తే?? ఏమవుతుంది?

             యుద్ధానికి సిద్ధమవ్వాలంటే ఆయుధాలు, ఆత్మవిశ్వాసాలు మాత్రమే కాదు. ఒక స్పష్టమైన లక్ష్యం ఉండాలి. కార్గిల్ లోనో ఆత్మరక్షణ లాగా, బంగ్లాదేశ్ ను లిబరేట్ చేయడం లాగా, ఇంకా మిగతా వాటిలాగా ఒక లక్ష్యం ఉండాలి. (plan of action, strategy) శత్రువు ఎవరు అని ఒక స్పష్టత ఉండాలి. ఉన్నా ఉపర్యుక్త విషయాలలో జరిగిందేమిటి , ఎవరు ఎలా గెలిచారు, ఓడారు అన్నది వేరే మాట. అసలు అయితే లక్ష్యం ఉంది. ప్రత్యర్థి ఉన్నారు.

                పాకిస్తాన్ బేస్డ్ అనే అన్ని సమూహాల గురించీ పత్రికలు వ్రాయగలవు తప్ప పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుందనడానికి మనం ఆధారం సంపాదించలేకపోయాం. ముంబయిదాడిలో అన్ని ఆధారాలు వగైరాలు పంపించినా పాకిస్తాన్ ని ఒప్పించలేకపోయినాం. పెద్ద నాయకులంతా నోటి వరకూ , ప్రసంగాల వరకూ తిట్టిపోయగలరే కాని వాస్తవమైన , క్షేత్రపరమైన, వస్తుపరమైన ఆధారాల గురించి రైటింగ్ లో పెట్టలేరు. చప్పున పోయి పాకిస్తాన్ శత్రుదేశమని యుద్ధం ప్రకటించడం కుదిరే పని కాదు. అంతర్జాతీయ సమాజమూ కట్టుబాట్లు కొన్ని ఉంటాయి.

         పైపెచ్చు ఒకటి రెండు నెలల్లో ఎన్నికలు ఇంత పెద్ద ప్రాంతంలో నిర్వహించే పెద్ద పెళ్ళి పని ముందుండగా , ఇప్పటి ప్రభుత్వం పెద్ద నిర్ణయాలు తీసుకుంటే ఎక్కడ పార్టీ పరంగా నష్టపోతామో అని పైపై మాటలు చెప్తుందే గానీ ఏ రిస్కూ తీసుకోదనేది బహిరంగ రహస్యమే.

      ఏతావాతా చెప్పొచ్చేదేమిటంటే ఏమీ జరగబోయేది లేదు. లేని పోని ఆవేశాలెందుకు వ్యక్తిగత , సంస్థాగత మీడియాల్లో? దండగ.

           పైగా ఇది మొదటిది కానట్టే చివరిదీ కాదు. అశుభం పలకాలని కాదు కానీ ఇదంతా మన స్వయంకృతాపరాధమే కాబట్టి ముందు వచ్చే పరిణామాలు ఇంతకన్నా గొప్పగా ఉంటాయని ఆశించలేము.
కాశ్మీరు రాజు హరిసింగ్ కలవాలనుకోలేదు కొన్నాళ్ళు  , ఏదో అవసరంకొద్దీ పాకిస్తాన్ దాడి చేస్తే సాయం అని వచ్చినప్పుడు కలిసిపోతేనే వస్తాం అని సంతకాలు పెట్టించుకున్నామన్నది మరిచిపోరాని చరిత్ర. తర్వాత నచ్చని వాళ్ళు కుట్రతో మాయోపాయాలతో (ప్రజల అభిప్రాయం అంటున్నారని) ప్రజలనే రిప్లేస్ చేసి అభిప్రాయాలను తిరగరాసేశారు, కుట్రో మరోటో. మనము వాళ్ళు కలిసి సృష్టించుకున్న ఈ మారణహోమం ఇప్పట్లో చల్లారే ఆశ కనిపించట్లేదు. మనము పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీరని, వాళ్ళు ఇండియా ఆక్రమిత/పాలిత కాశ్మీరని కొట్టుకుంటూ ఉంటాము. ఉన్నట్టుండి ఏదో చమత్కారం జరిగి అంతా బాగై పోయే ఆశ పెట్టుకొని కూర్చోవడం తో సహా ఇప్పుడు జరిగే knee-jerk  reactions అన్నీ హాస్యాస్పదాలే.