Loading...

25, జనవరి 2018, గురువారం

సంగోష్ఠి

వ్యాఖ్యను జోడించు
సావనీర్


సంస్కృత సంగోష్ఠి లో ధారాశుద్ధి గల సంస్కృత సంభాషణలు, కొన్ని మంచి ప్రసంగాలు వినడం బాగుంది.
ఉత్సాహంతో , శ్రద్ధతో పత్రసమర్పణలు, వ్యాఖ్యానాలు, కొత్త విషయాల వ్యక్తీకరణలతో ఆసక్తికరంగా సాగింది.

21, జనవరి 2018, ఆదివారం

సుశ్రావ్యముగా...

కోమల పదపల్లవమిమ్మా
వేమఱు మ్రొక్కెదనమ్మా వాణీ! ॥కోమల॥

ధవళపు మెఱుపుల అందముతో
కవనము హ్లాదము పంచు రీతిలో
భువనము మోదము పొందు రీతిలో ॥కోమల॥

గానము తీరుగ సమ్మోహనమై
కోనల సాగెడు జలపాతమ్మై
సోనలు కురిసే నా పలుకులలో  ॥కోమల॥

----లక్ష్మీదేవి.


18, జనవరి 2018, గురువారం

అనంత సారస్వత సౌరభం-రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారి “జయంత్యుత్సవం

సేకరణ-
ఈ విషయం గురించి తెలియగానే పోస్ట్ చేద్దామనిపించి వారి పోస్ట్ లోని విషయాన్ని కాపీ పేస్ట్ చేశాను. ఇంతకు మించిన వివరాలు తెలియవు. తెలిసిన వారు చెప్తే సంతోషమే.
-----------------------------------------------------------------------------------------------------------



తెలుగురధం - సాహిత్య, సాంస్కృతిక, సామాజిక వికాస సంస్థ దశాబ్ది సేవల్లోకి శ్రీకారం చుట్టిన సందర్భంలో -
ప్రపంచ రికార్డులు పొందిన సంస్థ శ్రీ త్యాగరాయ గానసభ - సంయుక్త నిర్వహణలో
************************************************************************


“గానకళాసింధు, సంగీత కళారత్న, సంగీత కళానిథి”
శ్రీమాన్ రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారి
“జయంత్యుత్సవం” (23-1-1893–11-3-1979) - సందర్భంగా
“అనంత సారస్వత సౌరభం”
విశిష్ట అతిథి:
ఆచార్య డా.యస్.ఉమాదేవి గారు,శాస్త్రీయ సంగీత శిక్షకులు
సభాధ్యక్షులు: కొంపెల్ల శర్మ గారు, అధ్యక్షులు,తెలుగురథం.
ఆత్మీయ అతిథి:
డా.సి.మృణాళిని గారు, సాహితీ విమర్శకురాలు,
గౌరవ అతిథి:
శ్రీ కళా జనార్దనమూర్తి గారు, అధ్యక్షులు, శ్రీ త్యాగరాయ గానసభ
తేదీ/సమయం:
25 జనవరి 2018,గురువారం, సా.6 గం.
వేదిక:
కళా లలిత కళా వేదిక, శ్రీ త్యాగరాయ గానసభ,
చిక్కడపల్లి,హైదరాబాద్.
*************************************************************************
సాహిత్య,సంగీతాభిమానులందరికీ సాదర స్వాగతం/ఆహ్వానం.
రావి గణపతి-కార్యదర్శి - తెలుగురధం.
శ్రీమతి కళా శారద దీక్షితులు,కార్యదర్శి, శ్రీ త్యాగరాయ గానసభ
Kompella Sarma & Telugu Ratham


9, జనవరి 2018, మంగళవారం

అన్నీ ఎండమావులే.

చాలా రోజుల తర్వాత భాగవతం లోని ఒక భాగం చదివాను. భాగవతుడు అక్రూరుని ప్రసంగమే చదవడం అదృష్టమే.
ఈ మత్తేభం నా దృష్టినాకర్షించింది.

కలలం బోలెడి పుత్త్రమిత్త్ర వనితాగారాది సంయోగముల్
జలవాంఛారతి నెండమావులకు నాసల్ సేయు చందంబునం
దలఁతున్ సత్యములంచు; మూఢుఁడ వృథాతత్త్వజ్ఞుఁడన్ నాకు నీ
విలసత్పాదయుగంబు సూపి కరుణన్ వీక్షింపు లక్ష్మీపతీ!

 అర్థము-
లక్ష్మీనాథుడవైన కృష్ణా! దప్పిక తీర్చుకోడానికి జలము వలె తోచే ఎండమావులకు ఆసపడు విధంగా స్వప్నసమానములయిన పుత్రులు, మిత్రులు, కళత్రము(భార్య/భర్త), గృహములు - మొదలైన జంజాటము సత్యమని భావిస్తుంటాను. మూఢత్వము నాది. మిథ్యాతత్త్వజ్ఞత నాది. ఇలాంటి నాకు ప్రకాశించు నీ పాదాల జంటను చూపి కరుణతొ కటాక్షించు.

భావము సుగమము.